Wednesday, October 23, 2024

APలో రెడ్ బుక్ పాల‌న‌…. చంద్ర‌బాబుపై విరుచుకుప‌డ్డ జ‌గ‌న్

గుంటూరు – రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలకు చంద్రబాబే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు వైఎ‍స్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌. పోలీసులు రెడ్‌ బుక్‌ పాలనలో నిమగ్నమయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు . ఏపీలో లా అండ్‌ ఆర్డర్‌ ఎలా ఉందో సహానా ఘటన చూస్తే అర్థమవుతోందన్నారు.

గుంటూరు జీజీహెచ్‌లో సహానా కుటుంబ సభ్యులను నేడు జగన్‌ పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి ధైర్యం చెప్పి భరోసా ఇచ్చారు. అనంతరం ఆసుపత్రి వద్ద వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో దారుణ పరిస్థితులు ఉన్నాయ‌న్నారు. దళిత చెల్లి పరిస్థితిని చూస్తే శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో అర్థమవుతుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్ఢర్ లేద‌ని,. శాంతిభద్రతలు దిగిజారిపోయాయ‌ని ధ్వ‌జ‌మెత్తారు. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్న సమయంలో అక్కచెల్లెమ్మలకు భరోసా ఉండేద‌ని, దిశ యాప్‌ ద్వారా ఆపదలో ఉన్న మహిళలకు అండగా నిలిచామ‌ని చెప్పారు.

- Advertisement -

నిందితుడు తెలుగుదేశం పార్టీనే..
ఈ ఘటనలో నిందితుడు నవీన్ చంద్రబాబుతో కలిసి దిగిన ఫొటోలు ఉన్నాయ‌ని,. స్థానిక ఎంపీతో కూడా సన్నిహితంగా ఉన్నాడ‌ని అన్నారు.. అధికారం అండ‌తోనే నిందితుడు బాధితురాలిపై శారీరకంగా, లైంగిక​ దాడి జరిపి ఆసుపత్రిలో జాయిన్‌ చేసి వెళ్లిపోయాడ‌న్నారు.. యువతిపై మృగాళ్లలా దాడి చేశాడ‌ని,. యువతి దేహాంపై కమిలిన గాయాలు ఉన్నాయ‌న్నారు. . ఇవన్నీ కళ్లేదుటే కనిపిస్తున్నా ప్రభుత్వం దాచిపెట్టే ప్రయత్నం చేస్తోంద‌ని జ‌గ‌న్ ఆరోపించారు. నిందితుడు అధికార టీడీపీకి చెందిన వాడు కాబట్టే అతడిని నిస్సిగ్గుగా కాపాడుకుంటున్నార‌ని మండిప‌డ్డారు. ఈ దారుణ ఘటనపై స్థానిక మంత్రి, హోంమంత్రి కనీసం స్పందించలేద‌ని అంటూ తాను ఇక్కడికి వస్తున్నా అని తెలిశాకే టీడీపీ నేత ఆలపాటి ఆసుపత్రికి వచ్చార‌న్నారు.

నిత్యం రాష్ట్రంలో అత్యాచార ఘ‌ట‌న‌లే ..

రాష్ట్రంలో ప్రతీచోట అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయ‌న్నారు.. బద్వేలులో కూడా ఇలాంటి ఘటనే జరిగింద‌ని,. బాలికపై పెట్రోలు పోసి నిప్పంటించార‌న్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు బాలికలపై అఘాయిత్యం చేశార‌న్నారు జ‌గ‌న్. కూల్‌డ్రింక్స్‌లో మత్తుమందు కలిపి అత్యాచారానికి పాల్పడ్డార‌ని, నిందితులు సైలం . పలాసలోని టీడీపీకి చెందిన ప్రబుద్దులే అని ఆరోపించారు. అఘాయిత్యాలు జరిగిన చోట పంచాయితీలు చేస్తున్నార‌న్నారు.

పిఠాపురంలో యువతిపై టీడీపీ నేత అత్యాచారం చేశార‌ని అంటూ , డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఏం చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు జ‌గ‌న్… పవన్‌ కనీసం బాలిక కుటుంబాన్ని పరామర్శించలేద‌న్నారు. హిందూపురంలోనూ అత్తాకోడలిపై గ్యాంప్‌ రేప్‌ జరిగినా, స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ కనీసం పరామర్శకు వెళ్లలేద‌న్నారు.. అనకాపల్లిలో బాలికను ప్రేమోన్మాది చంపేశాడ‌ని,. వేధింపులపై అంతకుముందు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేద‌న్నారు. టీడీపీ నాయకుల దౌర్జన్యాలను పోలీసులు అరికట్టలేకపోతున్నారన్నారు.

రాష్ట్రంలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగం నడుస్తోంద‌ని, టీడీపీ నాయకులు ఏ తప్పు చేసినా పోలీసులు వెనుకేసుకొస్తున్నార‌ని జ‌గ‌న్ ఆరోపించారు. . సాక్షాత్తూ సీఎం చంద్రబాబు దగ్గరుండి ప్రోత్సహిస్తున్నార‌న్నారు. పోలీసులు రెడ్‌ బుక్‌ పాలనలో నిమగ్నమయ్యార‌న్నారు. . బాబు అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల పాలనలో 77 మంది మహిళలు, పిల్లలపై అఘాయిత్యాలు జరిగాయ‌న్నారు. ఏడుగురు హత్య, ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నార‌న్నారు.

రెడ్‌బుక్‌ పాలనలో టీడీపీ నేతల తప్పులకు శిక్ష ఉండద‌ని పేర్కొన్నారుజ‌గ‌న్ . గతంలో దిశ యాప్‌తో 10 నిమిషాల్లో సాయం అందేద‌ని అంటూ దిశ యాప్‌ ద్వారా 31,607 మంది మహిళలను కాపాడామ‌ని అన్నారు.. వైఎస్సార్‌సీపీ హయాంలో 18 దిశ పీఎస్‌లు, 13 పోక్సో కోర్టులు ఏర్పాటు చేశామ‌ని,. ప్రతీ జిల్లాలోనూ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను నియమించామ‌ని తెలిపారు. కాగా, రాష్ట్రంలో ప్రతీ బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందజేయనున్నట్టు ప్రకటించారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి బాధితు కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని హితవు పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement