వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ముందస్తు బెయిల్ కోసం ఆయన పిటిషన్ ను విచారించిన న్యాయమూర్తి ఇరువైపు వాదనలు విని బెయిల్ మంజూరు చేసింది. అవినాష్ రెడ్డిని ఈనెల 25 వరకు అరెస్టు చేయవద్దని ఆదేశాల్లో పేర్కొంది. ఇదిలా ఉంటే ఈ కేసులో నిందితునిగా పేర్కొన్న అవినాష్ ను రేపు విచారణకు రావాల్సిందిగా సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుపై అవినాష్ న్యాయవాది స్పందిస్తూ విచారణకు హాజరవుతానని, సీబీఐకి సంపూర్ణంగా సహకరిస్తానని తెలిపారు. కాగా విచారణ సందర్భంగా అవినాష్ స్టేట్ మెంట్ ను, వీడియో రికార్డింగ్ చేయాలని హైకోర్టు సీబీఐని ఆదేశించింది. అలాగే రేపటి నుంచి 25వతేదీ వరకు అవినాష్ ను విచారణ చేయవచ్చని హైకోర్టు స్పష్టంగా ఆదేశాలిచ్చింది. ఈ విచారణ కాలంలో అతడిని అరెస్టు చేయవద్దని కోరింది. అవినాష్ ను అడిగిన ప్రశ్నలను లిఖితపూర్వకంగా ఆయనకు ఇవ్వాలని సీబీఐకి హైకోర్టు కండీషన్ విధించింది.
Breaking: అవినాష్ కు ముందస్తు బెయిల్.. రేపు సీబీఐ విచారణకు హాజరు
- Advertisement -
Advertisement
తాజా వార్తలు
Advertisement