అమరావతి,ఆంధ్రప్రభ: ఏపీ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో మరో వందే భారత్ రైలు అందుబాటు-లోకిరానుంది. ఈ నెల 7 నుంచి విజయవాడ – చెన్నై మధ్య నడవనుంది. ఈ రైలు విజయవాడ నుంచి గూడూరు, రేణిగుంట, కాట్సాడి మీదగా చెన్నై వెళ్లి తిరిగి రానున్నట్లు- సమాచారం.
అయితే దేశ వ్యాప్తంగా ప్రధాని మోదీ 5 వందే భారత్ రైళ్లను వర్చువల్ గా ప్రారంభించనున్నారు. అందులో విజయవాడ – చెన్నై రైలు కూడా అందుబాటు-లోకి రానుంది. ఇప్పటికే రాష్ట్రంలో వైజాగ్-సికింద్రాబాద్, తిరుపతి-సికింద్రాబాద్ మధ్య రెండు వందే భారత్ రైళ్లు తిరుగుతుండగా ఇది మూడో రైలు కానుంది.