Tuesday, November 19, 2024

ఏపీలో మ‌రో మూడు రోజులు భారీ వ‌ర్షాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశ‌ముంద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. కోమరిన్ ప్రాంతంను ఆనుకొని ఉన్న శ్రీలంక తీర ప్రాంతం మీద ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్లు ఎత్తు వరకు విస్తరించియున్నది. వేరొక అల్పపీడనం దక్షిణ అండమాన్ సముద్రము లో రేపటి కల్లా ఏర్పడవచ్చును. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి తదుపరి 48 గంటల్లో ఆగ్నేయ, దానికి స‌మీపంలోని తూర్పు మధ్య బంగాళా ఖాతం మీద వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపింది.

దీంతో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో మూడు రోజుల పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు, కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. మరి కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement