బంగాళాఖాతంలో మళ్లీ వస్తున్న అల్పపీడనం తమిళనాడు దక్షిణ ప్రాంతానికి వెళ్తున్నట్టు వాతావారణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయినా సరే మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోడానికైనా రెడీగా ఉండండి.. అని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు సహాయ కార్యక్రమాల కోసం మరో రూ.10 కోట్లు చొప్పున, మొత్తంగా రూ.40 కోట్లను వెంటనే ఇస్తున్నాం. అధికారులు అంతా డైనమిక్‌గా పనిచేయాలి. ఎలాంటి సమస్య ఉన్నా.. నా దృష్టికి తీసుకు రండి. విద్యుత్ పునరుద్ధరణలో ఎలాంటి ఆలస్యం ఉండకూడదు. అని తెలిపారు.
సరిపడా సిబ్బందిని తరలించి అన్నిరకాల చర్యలు తీసుకోండి. వరద ముంపును పరిగణలోకి తీసుకుని భవిష్యత్తులో కూడా ఇలాంటి పరిస్థితులు రాకుండా సంబంధించి సబ్‌స్టేషన్లను, కరెంటు సరఫరా వ్యవస్థను ముంపు లేని ప్రాంతాలకు తరలించాలి. పశువులకు దాణా కూడా అందించమని ఆదేశాలు జారీచేశాం. పశువులు మరణిసే… నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోండి. గండ్లు పడ్డ చెరువుల్లో శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. పింఛ, అన్నమయ్య ప్రాజెక్టుల నిర్మాణానికి కార్యాచరణ రూపొందించాలి: అధికారులకు సీఎం వైఎస్.జగన్ నిర్దేశం చేశారు.
ఈ సమీక్షలో హోంమంత్రి మేకతోటి సుచరిత, జలవనరులశాఖ స్పెషల్ సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ ఎస్ రావత్, ఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, డిజాస్టర్ మేనేజిమెంట్ కమిషనర్ కె కన్నబాబు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..