Thursday, November 21, 2024

ఏపీ ప్ర‌భుత్వానికి మ‌రో షాక్ : 6న ఆర్టీసీ స‌మ్మె

ఇప్ప‌టికే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పీఆర్సీ పై పంచాయ‌తీ కొన‌సాగుతోంది. గ‌త కొన్ని రోజులుగా ఉద్యోగులు ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీని వ్యతిరేకిస్తూ.. నిరసనలు తెలియజేస్తున్నారు. ఈనెల 7 నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు కూడా ప్రకటించారు. అయితే ఈరోజు మంత్రుల కమిటీతో.. పీఆర్సీ స్టీరింగ్ కమిటీ భేటీ అయింది. ఈ భేటీ కూడా పూర్తిగా అసంపూర్తిగా ముగిసింది. ఇదిలా ఉంటే ఆర్టీసీ కార్మికులు కూడా తమ డిమాండ్ల పరిష్కరించాలని ప్రభుత్వంపై ఒత్తడి చేస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగ సంఘాలైన‌ ఎన్ఎంయూ, ఈయూ, ఎస్ డబ్య్లూ ఎఫ్, కార్మిక పరిషత్ సంఘాల నేతలు తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరారు. తమ సమస్యలను పరిష్కరించకుంటే ఈనెల 6 నుంచి సమ్మెలోకి వెళ్తామని ఆర్టీసీ సంఘాల ఐక్యవేదిక ప్రకటించింది. ఈమేరకు 45 సమస్యలతో కూడిన మెమోరాండాన్ని ఆర్టీసీ ఎండీకి కార్మిక సంఘాల నేతలు అందించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement