వైసీపీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీకి రాజీనామా చేయగా.. తాజాగా మరో నేత పార్టీకి గుడ్ బై చెప్పారు. వైసీపీకి మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ రాజీనామా చేశారు. రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు.
ఐఏఎస్ అధికారిగా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ఎన్నికల ముందు వైసీపీలో చేరిన ఇంతియాజ్… కర్నూలు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఇంతియాజ్ ఇప్పుడు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్‌కు పంపించారు.