Monday, January 13, 2025

AP | తిరుపతిలో మరో రోడ్డు ప్రమాదం.. రెండు ఆర్టీసీ బస్సులు ఢీ !

పండుగ పూట‌ తిరుపతిలో వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తిరుపతి జిల్లాలోని భాకరాపేట ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ఆర్టీసీ బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్ర‌మాదంలో 30 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ‌గా… క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

రెండో ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ ప్రమాదం..

తిరుమల రెండో ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పిట్టగోడను ఢీకొట్టింది. అదృష్టవశాత్తూ బస్సు లోయలో పడకుండా పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో పలువురు భక్తులు స్వల్పంగా గాయపడ్డారు.

- Advertisement -

మరోవైపు తిరుమలలోని లడ్డూ పంపిణీ కౌంటర్‌లో స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. కౌంటర్ 47లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సిబ్బంది వెంటనే స్పందించి మంటలు ఇతర కౌంటర్లకు వ్యాపించకుండా ఆర్పివేశారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండడంతో పెను ప్రమాదం తప్పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement