Thursday, November 21, 2024

AP: మరో కొత్త జ్వరం స్రబ్ టైపస్.. కుప్పంలో మొదటి కేసు నమోదు

కుప్పం, ఆగస్టు 12(ప్రభ న్యూస్): వర్షా కాలంలో డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాల మాదిరిగా ఇప్పడు కుప్పంలో మరో కొత్త జ్వరం వ్యాప్తి చెందుతున్నది. కుప్పం పి ఈ ఎస్ ఆసుపత్రిలో మొదటి కేసు నమోదు అయ్యినట్లు పిఈఎస్ వైద్య కళాశాల డిన్, ప్రిన్సిపాల్ డాక్టర్ హెచ్ ఆర్ కృష్ణ రావు, మెడికల్ సూపర్డెంట్ డాక్టర్ సుబ్రహ్మణ్య ఒక ప్రకటనలో తెలిపారు. వారి కథనం మేరకు.. ఈ జ్వరం సబ్ టైపస్ అనే కొత్త రకం వచ్చింది. ఇది ప్రజల ఆరోగ్యం పై ప్రభావం చూపుతుందని పిఈఎస్ వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇది చాలా అరుదుగా సంభవించినప్పటికి ఈ జ్వరం చాలా కాలం పాటు సంభవిస్తే వివిధ అవయవాలు పాడవడానికి దారితీస్తుందని వారు తెలిపారు. అంతే కాకుండా రోగి మరణానికి కూడా దారి తీయవచ్చునని పి.ఇ.యస్. వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఈ జ్వరంకు ముఖ్య కారణం క్రీములు…

అదేవిధంగా స్రబ్ టైపస్ అనేది విష జ్వరమని, ఒకక్రిమి కాటు వల్లన వస్తుందని, ఈ క్రిములు పొలాల్లో, ఉతకని బట్టల్లో, శుభ్రం చేయని బట్టల బీరువాలో ఉంటాయన్నారు. ఈ జబ్బు బారిన పడేవారు పిల్లలు, వృద్ధులే అధికంగా ఉంటారని వైద్యులు తెలిపారు.

- Advertisement -

జ్వరం వస్తే ఉండే లక్షణాలు..

తీవ్రమైన జ్వరం, తలనొప్పి, శరీరంపైన దద్దుర్లు, నల్లటి మచ్చలు వస్తాయి. ప్రభావం చూపే అవయవాలు
కిడ్నీ, ఊపిరితిత్తులు, కాలేయం దెబ్బతింటుంది.

తీసుకోవలసిన జాగ్రత్తలు, చర్యలు…

ఇంటిని, పరిసరాల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, వదిలిన బట్టలను ఎప్పటికప్పుడు ఉతకడం, తరచు స్నానం చేయడం, జ్వరం, శరీరంపై నల్లటి మచ్చలు వస్తే వెంటనే ఈ పై లక్షణాలు ఉన్న రోగులు వైద్యులను సంప్రదించాలని పి.ఇ.యస్. వైద్య కళాశాల డీన్, ప్రిన్సిపాల్ డాక్టర్. హెచ్ .ఆర్. క్రిష్ణారావు, మెడికల్ సూపర్ డెంట్ డా సుబ్రమణ్య ఎన్.కె లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement