Wednesday, November 20, 2024

విశాఖలో మరో ఎంఎస్‌ఎంఈ పార్కు.. ట్విట్టర్‌లో విజయసాయిరెడ్డి

విశాఖపట్నం, (ప్రభన్యూస్‌ బ్యూరో): విశాఖలో మరో ఎంఎస్‌ఎంఈ పార్కు ఎర్పాటు- కానుందని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మంగళవారం ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు. రాష్ట్ర పరిపాలనా రాజధాని అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటు-న్న ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం విశాఖలో ప్రభుత్వ, ప్రైవేటు- భాగస్వామ్యంతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల పార్కును అభివృద్ధి చేస్తోందని చెప్పారు. వంద ఎకరాల్లో ప్లగ్‌ అండ్‌ ప్లే విధానంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తోందని వెల్లడించారు.

సీఎం జగన్‌ ఆదేశాల మేరకు ఎస్‌ఈబీ, పోలీస్‌ అధికారులు కార్యాచరణ కొనసాగిస్తున్నారని, విశాఖ జిల్లా మారుమూల గిరిజన గ్రామాల్లో 217 ఎకరాల్లో 9.80 లక్షలకు పైగా గంజాయి మొక్కల్ని ధ్వంసం చేశారని వెల్లడించారు. మరోవైపు ఒడిశా నుంచి స్మగ్లింగ్‌ అవుతున్న 1,720 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు- చెప్పారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ గారితో భేటీ-లో ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి జల వనరులు, ఉమ్మడి సరిహద్దు, తీవ్రవాదం తదితర కీలక అంశాలపై చర్చించారని ఆయన వెల్లడించారు. కొఠియా గ్రామాలు, నేరేడి బ్యారేజీ, జంఝావతి రిజర్వాయర్‌, పోలవరం తదితర సమస్యలను సమన్వయంతో పరిష్కరించుకోవాలని నిర్ణయించినట్లు- తెలిపారు.ఈ చర్చలకు సంబంధించిన పోటోలను సోషల్‌ మీడియా ఖాతలలో పోస్టు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement