ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా నదిపై మరో భారీ బ్రిడ్జ్ నిర్మించాలన్న ప్రతిపాదనలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం నుంచి అమరావతి రాజధానికి కృష్ణా నదిపై 3.5 కిలోమీటర్ల మేరకు ఈ భారీ వంతెన నిర్మాణానికి ఎంపీ కేశినేని నాని ప్రతిపాదనలు పంపారు. దీనికి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఏపీ రాజధాని అమరావతిని.. అత్యుత్తమ నగరంగా అభివృద్ధి చేసేలా చట్టంలో పెట్టారు. కాగా, ఈ వంతెన నిర్మాణానికి అప్పట్లో చంద్రబాబు చర్యలు తీసుకున్నా.. జగన్ ప్రభుత్వం వచ్చాక పనుల్ని నిలిపేశారని ఎంపీ కేశినేని నాని తెలిపారు.
కృష్ణా నదిపై మరో భారీ వంతెన.. ఏపీ ప్రతిపాదనకు గడ్కరీ గ్రీన్ సిగ్నల్
Advertisement
తాజా వార్తలు
Advertisement