Saturday, November 23, 2024

AP: స‌ర్కారుకు చుక్కెదురు.. మ‌రో నిర్ణ‌యాన్ని ర‌ద్దు చేసిన హైకోర్టు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి హైకోర్టులో చుక్కెదుర‌య్యింది. ప్ర‌భుత్వం తీసుకున్న ఓ కీల‌క నిర్ణ‌యాన్ని ర‌ద్దు చేస్తూ హైకోర్టు ఇవ్వాల (మంగ‌ళ‌వారం) కీల‌క తీర్పు ఇచ్చింది. స‌బ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోకి ద‌స్తావేజు లేఖ‌రుల‌కు ప్ర‌వేశాన్ని నిషేధిస్తూ ఈ మ‌ధ్య‌నే రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ ద‌స్తావేజు లేఖ‌రుల సంఘం హైకోర్టును ఆశ్ర‌యించింది.

కాగా, ద‌స్తావేజుల‌ను రాస్తూ వినియోగ‌దారుల‌కు స‌హాయ‌ప‌డుతూ త‌మ జీవ‌నోపాధి సాగిస్తున్నామ‌ని వారు త‌మ పిటిష‌న్‌లో హైకోర్టుకు తెలిపారు. ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో త‌మ జీవ‌నోపాధి ప్ర‌శ్నార్థ‌కంగా మారింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీనిపై మంగ‌ళ‌వారం విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు… ద‌స్తావేజు లేఖ‌రుల‌ను స‌బ్ రిజ‌స్ట్రార్ కార్యాల‌యాల్లోకి నిషేధిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని ర‌ద్దు చేసింది. రాష్ట్ర ప్ర‌భుత్వం జారీ చేసిన ఉత్త‌ర్వుల‌ను కొట్టివేసింది. ఫ‌లితంగా స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లోకి ద‌స్తావేజు లేఖ‌రుల ఎంట్రీకి హైకోర్టు మార్గం సుగ‌మం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement