Cyclone : భారీ వర్షాలతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. నిన్నటిదాకా ఈశాన్య రుతుపవనాల తిరోగమనం.. బంగాళాఖాతంలో అల్పపీడనం, వాయుగుండాలతో ఎడతెరిపి లేని వానలు కురిశాయి. ఇప్పుడిప్పుడే కాస్త రీలిఫ్ రావడంతో హమ్మయ్య అనుకుంటున్న ఏపీ ప్రజలకు మరో బ్యాడ్ న్యూస్.
బంగాళాఖాతం నుంచి మరో తుపాన్ దూసుకొస్తోందని తెలుస్తోంది. గల్ఫ్ అఫ్ థాయిలాండ్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం అండమాన్ సముద్రంలోకి ఈరోజు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో… దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే భారీ వర్షాలకు తిరుమల కొండపై 6 డ్యాములు ఉప్పొంగుతున్నాయి. తిరుమల నడకదారిలో నీరు పరవళ్లు తొక్కుతూ దిగువకు ప్రవహిస్తోంది. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు భారీ వర్షంతో, చలిగాలులతో తీవ్రంగా ఇబ్బందికి గురవుతున్నారు,