ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. నిన్నటి కంటే ఇవాళ మరోసారి భారీగా కరోనా కేసులు పెరిగాయి. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 839 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్ లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,80,602 కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో కోవిడ్ వల్ల శ్రీకాకుళం, పశ్చిమ గోదావరిలలో ఒక్కొక్క రు చొప్పున మరణించారు. దీంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14,503 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,659 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 150 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 37,553 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 3,15,67,472 కరోనా పరీక్షలు చేసినట్టు ప్రకటించింది. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20,62,440 లకు చేరిందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital