అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు-కు సంబంధించి డి సెంబర్ నెలాఖరులోగా మరో 36 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆదేశించారు. ఎస్‌ఐపిబి ఆమోదం పొందిన ప్రాజెక్టులన్నీ వేగవంతంగా ఏర్పాటు- చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. వీటి ప్రగతిపై ప్రతి 15 రోజులకు నివేదిక సమర్పించాలని పరిశ్రమల శాఖ కమీషనర్ ప్రవీణ్ కుమార్ ను సిఎస్ ఆదేశించారు. నెలకు ఒకసారి ఈ అంశంపై సమీక్షిస్తానని సిఎస్ జవహర్ రెడ్డి తెలిపారు.
ఏపీలో పరిశ్రమలు ఏర్పాటు-కు సంబంధించి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదించిన ప్రాజెక్టుల ప్రగతిని శనివారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి పరిశ్రమల శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ, విశాఖ సమ్మిట్లో పరిశ్రమల శాఖకు సంబంధించి వివిధ కంపెనీల ద్వారా 3 లక్లల 41వేల కోట్ల రూపాయల పెట్టు-బడులుతో 2 లక్షల 38 వేల మందికి ఉపాధి కల్పించే 107 అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకోవడం జరిగిందన్నారు. ఇప్పటికే కొన్ని కంపెనీలు, పరిశ్రమలకు ముఖ్యమంత్రి వర్యులు భౌతికంగాను, వర్చువల్ గాను శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారన్నారు.
పరిశ్రమలు ఏర్పాటు-కు సంబంధించి భూసేకరణ, నిర్వాసితులకు పునరావాస చర్యలు తదితర అంశాలపై సిఎస్ జవహర్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. ముందుగా రాష్ట్ర పరిశ్రమల శాఖ కమీషనర్ కె. ప్రవీణ్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎస్‌ఐపిబిలో ఆమోదించిన ప్రాజెక్టులు వాటిప్రగతిని వివరించారు. అలాగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో చేసుకున్న అవగాహనా ఒప్పందాలు ఆయా కంపెనీల ఏర్పాటు-కు సంబంధించిన వివిధ అంశాలను వివరించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జెడి రామలింగేశ్వర రాజు తదితరులు పాల్గొన్నారు.