గంజాయి కేసులలో కూడా పెరుగుదల
తగ్గిన సాధారణ క్రైమ్ లు
వార్షిక పోలీస్ నివేదిక విడుదల
మీడియాకు వివరాలు తెలిపిన డిజిపి ద్వారకా తిరుమల రావు
విజయవాడ – ఎపిలో ఈ ఏడాది సైబర్ క్రైమ్ 34 శాతం పెరిగాయని, అలాగే గంజా కేసులు 3 శాతం పెరుగుదల ఉందని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు పేర్కొన్నారు. ఎపిలో ఈ ఏడాదిలో మొత్తం 92,094 క్రైం కేసులు రిపోర్ట్ అయ్యాయన్నారు. విజయవాడ డిజిపి కార్యాలయంలో నేడు ఈ ఏడాది క్రైం రిపోర్ట్ ను విడుదల చేశారు.. గత సంవత్సరంతో పోలిస్తే . ఓవరాల్ క్రైం రేటు 5.2 శాతం తగ్గిందన్నారు. ఇక, దొంగతనం, దోపిడీ కేసులు 0.2 శాతం పెరిగాయని, .. మహిళల పట్ల జరిగిన క్రైంలు 10 శాతం తగ్గాయని చెప్పారు.. ఇక . మహిళల హత్యలు 20 శాతం పెరిగాయని వివరించారు. ఎస్సీ, ఎస్టీల పట్ల నేరాలు కూడా 4.9 శాతం తగ్గాయని డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు.
డిజిటల్ అరెస్ట్ ఉండవు
మన దేశంలో డిజిటల్ అరెస్ట్ అనేదే లేదు అని డీజీపీ ద్వారకా తిరుమలరావు చెప్పుకొచ్చారు. ప్రతీ జిల్లాకి ఒక సైబర్ క్రైం పోలీసు స్టేషన్ ఏర్పాటు చేయడానికి సీఎం నిర్ణయించారన్నారు.. బ్యాంకర్లు కూడా అధిక మొత్తంలోని లావాదేవీల విషయంలో కస్టమర్లతో మాట్లాడితే పెద్ద నేరాలు జరగకుండా ఆపొచ్చని సూచించారు.
ఇక, 10, 837 ఎకరాల్లో గంజాయికి మారు పంటలు కూడా వేయించామని తెలిపారు… అలాగే, డ్రోన్లు వినియోగంలో ఆధునికతను పెంచుతున్నామని చెప్పారు. . 173 డ్రోన్లను వినియోగిస్తున్నామని, .. మనిషి వెళ్ళలేని చోట డ్రోన్లు వాడుతున్నామని వెల్లడించారు. కార్తీక మాసంలో డ్రోన్ల వల్లే బాపట్లలో ముగ్గురిని కాపాడామని చెప్పారు.
విజయవాడ ట్రాఫిక్ కంట్రోల్ కి డ్రోన్ వినియోగిస్తున్నామని డీజీపీ పేర్కొన్నారు ఏపీ, తెలంగాణాల్లోనే ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టం అమలులో ఉందని చెప్పారు. ఎఐను విదేశీ వ్యక్తులు, వేరే భాష వాళ్ళు ఉన్న కేసుల్లో వినియోగిస్తామని తెలిపారు… సీసీ టీవీలు ప్రతీ చోటా ఉండాలని కోరారు… నేరం జరిగిన విజువల్స్ కచ్చితంగా రికార్డు కావాలన్నారు.. సీసీ టీవీ కెమెరాలు విస్తృతంగా పెంచుతున్నామన్నారు. త్వరలోనే లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు, AI ద్వారా స్మార్ట్ పోలీసింగ్ చేస్తామని ఆయన వెల్లడించారు. అలాగే, పోలీసు వెల్ఫేర్ కి రూ. 20 కోట్లు సీఎం ఇటీవల ఇచ్చారని చెప్పారు. 189 సీనియర్ లెవెల్ ప్రొమోషన్లు ఇచ్చామని పేర్కొన్నారు… . జత్వానీ కేసులో కేసు ఇన్వెస్టిగేషన్ అధికారి చర్యలు తీసుకుంటారని చెప్పారు. .. మాజీ ఆర్మీ ఉద్యోగి ఎఎస్పీగా పవన్ కళ్యాణ్ పర్యటనలో తిరగలేదని, కేవలం.. ఆ వ్యక్తి శిలాఫలకం దగ్గర ఫోటోలు దిగాడని డీజీపీ ద్వారక తిరుమలరావు తెలిపారు.