Tuesday, November 26, 2024

అన్నవరంలో నిత్యాన్నదానం.. అరిటాకుల స్థానంలో ప్లేట్ లు

అరిటాకుల స్థానంలో ప్లేట్ లని తీసుకురానున్నట్లు అన్నవరం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. 35 ఏళ్ల క్రితం ఇక్కడ నిత్యాన్నదానం ప్రారంభం కాగా అప్పటి నుంచి భక్తులకు అరిటాకుల్లోనే అన్నప్రసాదం అందిస్తున్నారు. అయితే, ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు అరిటాకుల స్థానంలో కంచాలు తీసుకురావాలని, నేటి నుంచి అది అమలు చేయాలని నిర్ణయించారు.  అరిటాకుల లభ్యత అంతంత మాత్రమే కావడంతోపాటు ఖర్చు తగ్గించుకునే ఉద్దేశంతో కూడా అరిటాకుల స్థానంలో కంచాలు తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు. అలాగే, బఫే పద్ధతిలోనే అన్న ప్రసాద వితరణ చేయాలని నిర్ణయించారు. అయితే హాలు సిద్ధం కాకపోవడం, క్యూ లైన్ల పనులు పూర్తి కాకపోవడంతో ప్రస్తుతానికి బఫే పద్ధతిని వాయిదా వేశారు. భక్తులు తినే కంచాలను శుభ్రం చేసేందుకు యంత్రాలను కూడా సిద్ధం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement