లింగంపల్లి నుంచి విశాఖ వెళ్తున్న జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలులో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అన్నవరంలో గంటసేపు, తునిలో గంటసేపు జన్మభూమి ఎక్స్ ప్రెస్ నిలిచిపోయింది. రైల్వే అధికారులు నుంచి సరైన స్పందన లేకపోవడంతో రైలులో రెండు గంటల పాటు ప్రయాణికులు నరకం అనుభవిస్తున్నారు. ఇంజన్ రిపేరుతో ఆగిపోయిన ఈ రైలు ప్రస్తుతం ఎలమంచిలిలో ఉన్నట్టు తెలుస్తొంది.
సాయంత్రం 5:38 గంటలకు తుని చేరుకున్న జన్మభూమి ఎక్స్ప్రెస్ షెడ్యూల్ ప్రకారం రాత్రి 7:45 గంటలకు విశాఖపట్నం చేరుకోవాల్సి ఉండగా రాత్రి 9:15 గంటల వరకూ తునిలోనే ఉండిపోయింది. కాగా, షెడ్యూల్ ప్రకారం రాత్రి 7:45 గంటలకు విశాఖ చేరుకోవాల్సిన జన్మభూమి ఎక్స్ ప్రెస్ .. రాత్రి 12:30 గంటలకు విశాఖ రైల్వేస్టేషన్ కు చేరుకుంటుందని సమాచారం.