అంగన్ వాడీల రూపురేఖలు మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ అన్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా జగన్ మాట్లాడుతూ.. దీనిలో భాగంగా బాలింతలు, గర్భవతుల్లో రక్తహీనతతో పాటు చిన్నారుల్లో పౌష్టికాహార లోపాలను నివారించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
నాణ్యమైన ఆహారాన్ని అందించాలన్నారు. ఆహారంలో క్వాలిటీ, కచ్చితమైన క్వాంటిటీ ఉండాలన్నారు. టాయిలెట్ల శుభ్రతపైనా దృష్టి పెట్టాలన్నారు. చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించాలన్నారు. నిర్ధేశించుకున్న ప్రమాణాలతో అంగన్ వాడీల ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలన్నారు.