ఏపీ ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల విధుల్లోకి అంగన్వాడీలు, కాంట్రాక్టు ఉద్యోగులను తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు.
- Advertisement -
పోలింగ్ విధుల్లో సిబ్బంది కొరత దృష్ట్యా అంగన్వాడీలు, కాంట్రాక్టు ఉద్యోగులను ఓపీఓలుగా నియమించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల కమిషన్.. మరోవైపు ఎన్నికల విధుల్లో పాల్గొనే అన్ని కేటగిరీల వారికి పోస్టల్ బ్యాలెట్ కోసం ఫాం 12 డి జారీ గడువును మే 1 తేదీ వరకూ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ మీనా.