అమరావతి : ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీలు పోరాటాన్ని ఉద్ధృతం చేశారు. ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి కార్యక్రమంతో ఆందోళనలను హోరెత్తించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గిరిధర్‌రావు కార్యాలయం ఎదుట బుధవారం నిరసన ప్రదర్శన చేపట్టారు.
ఈ సందర్భంగా దీప్తి మాట్లాడుతూ ప్రభుత్వం చర్చల పేరుతో అంగన్వాడీల సమస్యలను నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. ఆర్థిక పరమైన విషయాలను పరిష్కరిస్తేనే తాము సమ్మె విరమిస్తామని.. అప్పటి వరకూ సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేశారు తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఇంటిని అంగన్వాడీ కార్యకర్తలు ముట్టడించారు. ఎమ్మెల్యే ఇంటి ముందు బైఠాయించి నినాదాలు చేశారు.
బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి ఇంటి ముట్టడికి యత్నించిన అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు, అంగన్వాడీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. విశాఖలోనూ వైసిపి ఎమ్మెల్యేల ఇంటి ఎదుట ధర్నాకు దిగారు.. విజయనగరంలో బొత్స కార్యాలయం వద్ద నిరసన దీక్షకు దిగారు అంగన్వాడీలు .. అంగన్వాడీల ఆందోళన రోజు రోజుకి తీవ్రతరం కానుండటంతో ఎక్కడికక్కడ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ లకు తరలిస్తున్నారు.