ఇబ్రహీంపట్నం,ప్రభ న్యూస్: అంగన్ వాడీల సమస్యలు పరిష్కరించాలని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఇంటిని గురువారం అంగన్ వాడీ కార్యకర్తలు ముట్టడించారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, గ్రాడ్యూటీ ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అంగన్ వాడీల పై పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు.
మంత్రి జోగి బయటకు రావాలని నినాదాలు చేశారు. మంత్రి జోగి ఇంటి ముట్టడి నేపథ్యంలో పోలీసులు మోహరించారు. అంతకు ముందు రింగ్ సెంటర్ నుంచి ఫెర్రీ రోడ్డులోని మంత్రి ఇంటికి ర్యాలీగా చేరుకున్నారు. సీఐటీయూ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.సిహెచ్.శ్రీనివాస్, సీఐటీయూ ఇబ్రహీంపట్నం, మైలవరం మండలాల కార్యదర్శులు ఎం.మహేష్, సిహెచ్.సుధాకర్ తదితరులు నాయకత్వం వహించారు.