సామగ్రి కొట్టేసిన ఘటనపై విచారణ
ఆంధ్రప్రభ కథనాలతో ఈపీడీసీఎల్లో కదలిక
ప్రాథమిక విచారణ చేపట్టిన విజిలెన్స్ బృందం
ఆంధ్రప్రభ కథనం.. అక్షర సత్యాలని తేటతెల్లం
ఆంధ్రప్రభ స్మార్ట్, ఏఎస్‌ఆర్ జిల్లా ప్రతినిధి :
అల్లూరి సీతారామరాజు జిల్లా మారుమూల ప్రాంత గిరిజనులకు విద్యుత్ వెలుగుల సదుపాయం కల్పించాలని సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు- చేసిన సోలార్ విద్యుత్తు కేంద్రాల్లో సామాగ్రి చోరిని రాజకీయ అండతో కొందరు మూటగట్టుకున్న విషయం పాఠకులకు తెలిసిందే. జీకే వీధి, చింతపల్లి మండలాల్లోని 123 మారుమూల పల్లెల్లోని 96 గ్రామాల్లో సౌర విద్యుత్ యూనిట్లలోని అతి విలువైన బ్యాటరీలు, ప్యానల్ బోర్డులు, సోలార్ ప్లేట్స్ తదితర పరికరాలు మాయం కాగ, ఆంధ్రప్రభ స్మార్ట్ ఏడిషన్ లో ఈనెల 12న సోలార్ సిస్టమ్స్ లేపేశారు అనే శీర్షికతో వార్తా కథనం ప్రచురితమైంది. ఆంధ్రప్రభ మెయిన్ పేజీలో సోలార్ సామాగ్రి మాయం అనే శీర్షికతో వార్తా కథనాలను ప్రచురించితమైంది. ఈ సౌర విద్యుత్ పరికరాల చోరీలో రూ. 20 కోట్ల మేర కుంభకోణం జరిగినట్లు ఈ వార్త కథనం సారాంశం .
రంగంలోకి విజి ‘లెన్స్’
ఏపీఈపీడీసీఎల్ సోలార్ విద్యుత్ సామగ్రి అపహరణ ఆరోపణలపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. విజిలెన్స్ ఎస్‌ఈ కింజరాపు వెంకట రామకృష్ణ ప్రసాద్, సిబ్బంది కలసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో భాగంగా చింతపల్లి మండల కేంద్రంలోని ఈపీడీసీఎల్ ఉప కేంద్రంలో విజిలెన్స్ అధికారులు పలువురిని విచారించారు. ఈ ప్రాథమిక విచారణలో సోలార్ సామగ్రి మాయం వెనుక వైసీపీ నాయకుల హస్తం ఉన్నట్లు- విజిలెన్స్ అధికారులు గుర్తించినట్లు- ప్రచారం జోరుగా సాగుతోంది.
ఆంధ్రప్రభ అక్షర సత్యాలు
చింతపల్లి, జీకేవీధి మండలాల్లో గత టీ-డీపీ ప్రభుత్వం 2016 నుంచి 2019 వరకు విడతల వారీగా గిరిజన గ్రామాలకు సోలార్ విద్యుత్ ప్లాంట్ లను ఏర్పాటు- చేసింది. ఈ సోలార్ విద్యుత్ ప్లాంట్ ద్వారా గిరిజనులకు విద్యుత్ సరపరా చేశారు. ఒక్కొక్క విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు- చేసేందుకు రూ. 27 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ప్రభుత్వం ఖర్చు చేసింది. చింతపల్లి, జీకేవీధి మండలాల్లో 129 ప్లాంట్లు- ఏర్పాటు- చేశారు. 2020 నుంచి సోలార్ విద్యుత్ ప్లాంట్లు- ఏర్పాటు- చేసిన గిరిజన గ్రామాలకు ఈపీడీసీఎల్ అధికారులు విద్యుత్ సౌకర్యం కల్పించడంతో సోలార్ విద్యుత్ పరికరాలపై మైదాన ప్రాంతాల నేతల కన్ను పడిందే అదే తడువుగా స్థానిక వైసీపీ నాయకులతో చేతులు కలిపి సోలార్ సామాగ్రి మాయం చేసి మైదాన ప్రాంతాల్లో అమ్ముకొని పెద్ద ఎత్తున సోమ్ము చేసుకున్నారని ప్రచారం జరిగింది. ఇదే విషయాన్ని ఆంధ్రప్రభ స్మార్డ్ ఎడిషన్, దినపత్రికలో ఈ నెల 11, 12 వ తేదీల్లో వరుస కథనాలను ప్రచురించింది. ఆంధ్రప్రభ కథనాలకు స్పందించిన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు విజిలెన్స్ విచారణకు ఆదేశించారు.