కేరళ జట్టు సున్న… ఆంధ్ర జట్టు 11 స్కోర్ తో విజయం
బెస్ట్ ప్లేయర్ గా శ్రీవిద్య
శ్రీవిద్యకు మేమెంటో అందజేసిన నేషనల్ హాకీ ఎంపైర్ బి.సుధాకర్
పులివెందుల, జులై 13 (ప్రభ న్యూస్) : పులివెందులలో జరుగుతున్న జూనియర్ బాలురు, బాలికల సౌత్ జోన్ నేషనల్ ఛాంపియన్షిప్ 24 హాకీ విభాగంలో శనివారం ఆంధ్రప్రదేశ్, కేరళ చెట్లు తలపడగా… ఆంధ్రప్రదేశ్ బాలికలు కేరళ బాలికలపై 11 స్కోర్ తో ఘనవిజయాన్ని సాధించారు. కేరళ జుట్టు 0 తో సరిపెట్టుకొని వెనుదిరిగారు. దీంతో కేరళ జుట్టును ఆంధ్ర జట్టు దుమ్ము రేపింది. అనంతరం రెండో మ్యాచ్ బాలుర మ్యాచ్ కర్ణాటక, తెలంగాణ జట్లు తలపడ్డాయి. ఆంధ్రప్రదేశ్, కేరళ మధ్య జరిగిన హోరా హోరీ మ్యాచ్ లో ఆంధ్రప్రదేశ్ విజయం సాధించింది.
ఆంధ్రప్రదేశ్ లో విజయం సాధించిన బెస్ట్ ప్లేయర్ గా శ్రీవిద్యను ఎంపిక చేసి కడప జిల్లా ఉమెన్ హాకీ మాజీ సెక్రటరీ, నేషనల్ హాకీ ఎంపైర్ బి సుధాకర్, జిల్లా సెక్రటరీ శేఖర్ ల చేతులమీదుగా మెమెంటోను అందజేశారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ… 60 సంవత్సరాలుగా పులివెందులలో హాకీ అంటే ఒక స్థానంలో ఉందని ఆయన అన్నారు. ప్రస్తుతం నేషనల్ లెవెల్లో ఆంధ్ర జుట్టు దూసుకుపోతుండడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ హాకీ క్రీడను ముందుకు తీసుకెళ్లేందుకు నాయకుల సహకారం ఎంతో ఉందన్నారు.