Tuesday, November 26, 2024

Andhra Pradesh – లోక్ స‌భ ఎన్నిక‌ల‌లో వైసిపికి చావుదెబ్బ‌…

23 సీట్ల నుంచి రెండు సీట్ల‌కే ప‌రిమితం
17 సీట్ల‌లో పోటీ చేసి 16 సీట్ల‌లో సైకిల్ జోరు
జ‌న‌సేన పోటీ చేసిన రెండు స్థానాల‌లో విజ‌య కేత‌నం
ఆరు స్థానాల‌లో రంగంలోకి దిగిన క‌మ‌ల‌నాధుల‌కు
పాంచ్ పటాక్ జాక్ పాట్

లోక్ సభ ఎన్నికలలో వైసిపికి చావు దెబ్బ తగిలింది.. గతంలో 25 స్థానాలు గాను 22 సీట్లు గెలుచుకున్న వైసిపి ఈ సారి రెండు సీట్లకు పరిమితమయ్యేలా కనిపిస్తున్నది… తెలుగుదేశం,జనసేన, బిజెపి కూటమి జోరుగా వైసిపి రెక్కలు విరిగిపోయాయి.. 25 స్థానాలలో పోటీ చేసిన ఆ పార్టీకి కేవలం రెండు సీట్లే గెలుచుకునే స్థితిలో ఉంది.. ఇప్ప‌టి వ‌ర‌కు అందిన స‌మాచారం మేర‌కు అర‌కు, క‌డ‌ప‌లో మాత్ర‌మే ఆ పార్టీ కాస్త ముందంజ‌లో ఉంది. ఇక తెలుగుదేశం పార్టీ 17 స్థానాల‌లో పోటీ చేసి 16 స్థానాల‌లో ముందంజ‌లో ఉంది.. జ‌న‌సేన పోటీ చేసిన కాకినాడ‌, మ‌చిలీప‌ట్నం స్థానాల‌ను గెలుచుకోనుంది.. ఇక బిజెపి ఆరు స్థానాల‌లో బ‌రిలోకి దిగిన బిజెపి ఏకంగా అయిదు స్థానాల‌లో విజ‌య‌కేతం ఎగుర‌వేయ‌నుంది..

1.అనకాపల్లి: బీజేపీ- సీఎం రమేష్
2.విశాఖపట్నం: టీడీపీ – శ్రీభరత్

  1. విజయనగరం: టీడీపీ – కలిశెట్టి అప్పలనాయుడు
  2. అరకు: తునూజారాణి వైసిపి
  3. శ్రీకాకుళం: రామ్మోహన్ నాయుడు టిడిపి
  4. నెల్లూరు: టీడీపీ – వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి
  5. ఒంగోలు: టీడీపీ- మాగుంట శ్రీనివాసులు రెడ్డి
  6. బాపట్ల: టీడీపీ – తెన్నేటి కృష్ణప్రసాద్
  7. నరసరావుపేట: టీడీపీ – లావు కృష్ణదేవరాయులు
  8. గుంటూరు: టీడీపీ – పెమ్మసాని చంద్రశేఖర్
  9. విజయవాడ: టీడీపీ – కేశినేని చిన్ని
  10. మచిలీపట్నం: జనసేన – బాలశౌరి
  11. ఏలూరు: టిడిపి – పుట్టా మహేష్ యాదవ్
  12. నరసాపురం: బీజేపీ – శ్రీనివాస వర్మ
  13. రాజమండ్రి: బీజేపీ – పురంధేశ్వరి
  14. అమలాపురం: టీడీపీ – గంటి హరీష్
  15. కాకినాడ: జనసేన – ఉదయ శ్రీనివాస్
  16. నంద్యాల:టిడిపి – బైరెడ్డి శబరి
  17. కర్నూలు: టీడీపీ – నాగరాజు
  18. అనంతపురం: టిడిపి – లక్షీనారాయణ
  19. హిందూపురం: టీడీపీ – బీ.కే పార్థసారధి
  20. కడప: వైసీపీ – వైఎస్ అవినాష్ రెడ్డి
  21. తిరుపతి: బీజేపీ – వరప్రసాద్
  22. రాజంపేట: బీజేపీ – నల్లూరి కిరణ్‌కుమార్‌ రెడ్డి
  23. చిత్తూరు: టీడీపీ – దగ్గుమళ్ల ప్రసాదరావు

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement