Monday, July 1, 2024

Andhra Pradesh – ముఖ్యమంత్రి ఎలా ఉండాలో నేను నిరూపిస్తా – చంద్రబాబు

అమరావతి – ముఖ్యమంత్రి ఎలా ఉండాలో నేను నిరూపిస్తా.. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలి.. వాటిని దాయకూడదు.. నా పాలనలో హడావిడి ఉండదు.. ప్రజలతో మమేకం కావడమే ప్రభుత్వ లక్ష్యం అని ప్రకటించారు సీఎం చంద్రబాబు. ,మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన.. పెనుమాకలో ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ల పథకాన్ని ప్రారంభించారు.. స్వయంగా లబ్ధిదారుల ఇంటికే వెళ్లి పెన్షన్‌ అందించారు సీఎం..

ఇక, ఈ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో పింఛన్ల మసీదు సెంటర్‌లో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో గ్రామస్థులు, లబ్ధిదారులతో ఆయన మాట్లాడారు.వివిధ అంశాలను ప్రస్తావించారు. ఆడబిడ్డలకు రక్షణగా ఉంటాం.. మహిళల మీద అత్యాచారాలు చేసేవాళ్లకు అదే చివరి రోజు అవుతుంది అంటూ హెచ్చరించారు. ఇప్పటి వరకు మర్యాదగా చెప్పాను.. గంజాయి మత్తులో వికృత వేషాలు వేస్తే ఎవరిని వదిలిపెట్టను అని సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు

- Advertisement -

ఇక, పోలవరం పూర్తిఅయితే రాష్ట్రంలో ప్రతి ఎకరానికి నీళ్లు ఇచ్చేవాళ్ళం.. అమరావతి పూర్తి అయ్యి ఉంటే ప్రతి ఒక్కరికీ ఉపాధి దొరికేది అన్నారు చంద్రబాబు.. కానీ, గత ప్రభుత్వ పాలన మొత్తం తప్పులు, అప్పులు గానే సాగిందన్నారు.. ఎంత అప్పు ఉందో తెలియడం లేదు.. అయితే, సంపద సృష్టించే భాధ్యత నాది.. పేదరికం లేని సమాజం కోసం ప్రయత్నిస్తున్నా.. ఇచ్చిన హామీని 26 రోజుల్లో అమలు చేసిన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని స్పష్టం చేశారు.

సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పిన ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ టిడిపి .. ఆ దిశగా పనిచేస్తా అన్నారు. మరోవైపు.. సీఎం వస్తున్నాడంటూ హడావిడి వద్దు.. పదరాలు కట్టొద్దు అని సూచించారు.. పరదాలు కడితే, కట్టిన అధికారికి సస్పెన్షన్ తప్పదు అని హెచ్చరించారు.. షాక్ ట్రీట్ మెంట్ ఇవ్వడానికి నేను సిద్ధం గా ఉన్నా.. రాబోయేది చంద్రబాబు 4.0 పాలన … 95 సీబీఎన్‌ని చూస్తారు అని తెలిపారు సీఎం చంద్రబాబు..

ఇంకా ఏం మాట్లాడారంటే –

పేదలపై శ్రద్ధ పెడతాం.. అనునిత్యం వినూత్నంగా ఆలోచిస్తాం. ఆర్థిక అసమానతలు లేని సమాజం చూడాలన్నదే నా ఆలోచన. దివ్యాంగులకు పింఛను రూ.6వేలు చేశాం. వారికి చేయూతనివ్వడం సమాజం బాధ్యత. నిత్యావసర వస్తువుల ధరలకు కళ్లెం వేయాల్సి ఉంది. పంపిణీ చేతకాకపోతే ఇంటికి వెళ్లాలని గత పాలకులకు చెప్పాగత పాలకులు, అధికారులు సచివాలయ సిబ్బందితో పింఛన్ల పింపిణీ తమ వల్ల కాదన్నారు. పంపిణీ చేతకాకపోతే ఇంటికి వెళ్లాలని వారికి ఆనాడే చెప్పా. నేడు 1.25లక్షల మంది సచివాలయ సిబ్బందితో పంపిణీ జరుగుతోంది. దీనికి వాలంటీర్ల సహాయం కూడా తీసుకోవాలని చెప్పాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే రోజు ఐదు సంతకాలు పెట్టా.

మొదటిది మెగా డీఎస్సీ.. వీలైనంత త్వరగా టీచర్ల నియామకం చేపట్టే బాధ్యత తీసుకుంటా. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దుపై రెండో సంతకం చేశా. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై మూడోది పెట్టా. రూ.5 కే భోజనం చేయొచ్చు. త్వరలోనే 183 క్యాంటీన్లను ప్రారంభిస్తాం. యువతకు ఉద్యోగాల కల్పన కోసం నైపుణ్య శిక్షణ ఇస్తాం. ప్రభుత్వానికి శక్తి వస్తే ప్రజలకు మరింత తిరిగి ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. మాది ప్రజా ప్రభుత్వం.. నిరంతరం మీకోసం పనిచేస్తాం. ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించి ప్రభుత్వానికి సహకరించాలి.

మంగళగిరి రుణం తీర్చుకుంటాం.

తవ్వుతున్న కొద్దీ గత ప్రభుత్వ తప్పులు, అప్పులే కనబడుతున్నాయి. గతంలో ప్రజల బతుకులను రివర్స్‌ చేశారు.. కోలుకుని మళ్లీ ముందుకు వెళ్లాలి. అందరం సమష్టిగా కలిసి పనిచేద్దాం. సంపద సృష్టించి ఆదాయం పెంచుతాం.. పెంచిన దాన్ని పంచుతాం. మీ అందరి అభిమానం చూరగొని లోకేశ్‌ ఇక్కడి నుంచి పోటీ చేశారు. మంగళగిరిలో 90 వేలకు పైగా మెజారిటీతో ఆయన్ను గెలిపించారు. ఈ నియోజకవర్గం రుణం తీర్చుకుంటాం.

.వైకాపా నేతలు ఐదేళ్ల పాటు ప్రజలను అణగదొక్కారు. పెట్టుబడులు పెట్టేందుకు భయపడే పరిస్థితి కల్పించారు” అని చంద్రబాబు అన్నారు. మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించిన పలు సమస్యలను మంత్రి నారా లోకేశ్‌ ప్రస్తావించారు. వాటిని పరిష్కరించాలని మంత్రి లోకేశ్‌ సీఎంను కోరారు. అమరావతి నిర్మాణ పనులకు మంగళగిరి ప్రజలు అండగా ఉంటారని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement