Thursday, September 12, 2024

Andhra Pradesh – స్థానిక ఎన్నిక‌ల‌లో ఆ నిబంద‌న ఎత్తివేత‌….

ఇద్ద‌రు పిల్లలు కంటే ఎక్కువున్నా ఇక పోటీకి అర్హ‌త
వెల్ల‌డించిన ఎపి సిఎం చంద్ర‌బాబు
పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖల‌పై
ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ తో క‌ల‌సి స‌మీక్ష‌
వేడుక‌ల వ్య‌యాన్ని పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌ట‌న
గౌర‌వ వేత‌నం పెంపుపై చ‌ర్చ‌లు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – అమ‌రావ‌తి – గ్రామ పంచాయతీలకు స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల వ్యయం పెంచాలని ఎపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ నిర్ణ‌యించారు.. ఈ వేడుకల వ్యయాన్ని రూ.10 వేల నుంచి 25 వేలకు పెంచినట్టు ప్ర‌క‌టించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నేడు పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖ సమీక్ష సమావేశం చంద్ర‌బాబు నిర్వహించారు.. ఈ స‌మీక్ష‌లో డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

ఈ స‌మీక్ష‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉంటే పోటీకి అనర్హత నిబంధన ఎత్తివేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు వెల్లడించారు. దీనిపై కేబినెట్ లో చట్ట సవరణ బిల్లు కూడా ఆమోదించినట్టు తెలిపారు. స్థానిక సంస్థల ప్రతినిధులకు గౌరవ వేతనం పెంపు అంశం కూడా నేటి సమీక్ష సమావేశంలో చర్చకు వచ్చింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను పంచాయతీరాజ్ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది.

కాగా, గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం నిర్వహణకు ప్రత్యేక మొబైల్ యాప్ తీ రూపొందించి, దాని ద్వారా గ్రామీణ పారిశుద్ధ్యాన్ని పర్యవేక్షిస్తున్నట్టు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఇక, ఈ నెల 23న రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహిస్తున్నట్టు పవన్ సీఎం చంద్రబాబుకు వివరించారు. 13,326 పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement