Tuesday, November 19, 2024

ఏపీలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్… ఒక్కరోజే 10 లక్షల మందికి టీకా

ఏపీలో వ్యాక్సిన్ పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం ప్రత్యేక టీకా డ్రైవ్ చేపట్టనున్నారు. కేవలం ఒక్క రోజులోనే 8 నుంచి 10 లక్షల డోసులను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ముందస్తుగా 14 లక్షల డోసుల వ్యాక్సిన్లను వివిధ జిల్లాలకు సరఫరా చేశారు. అత్యధిక మందికి వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని చేపట్టాల్సిందిగా జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఒక్కరోజూలోనే 6 లక్షల వ్యాక్సిన్లు వేసి రికార్డు సృష్టించింది. ఇక, ఆదివారం 10 లక్షల డోసుల వ్యాక్సిన్​ వేసి మరో రికార్డును సొంతం చేసుకోవాలని ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రత్యేక టీకా డ్రైవ్ క్యాంపెయిన్ లో 45 ఏళ్లు పైబడిన వారితో పాటు అయిదేళ్లలోపు పిల్లలు కలిగిన తల్లులకు టీకా వేయనున్నారు. ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 1,22,83479 మందికి టీకా వేశారు. వారిలో 26,41,000 మందికి రెండు డోసులు, 71 లక్షల మంది ఒక డోసు ఇచ్చారు. జూన్ నెలకు సంబంధించి 2,66,000 మందికి కొవాగ్జిన్, 2,10,000 మంది కొవిషీల్డ్ సెకండ్ డోసు వేయాల్సి ఉంది. 5,29,000 మంది అయిదేళ్లలోపు పిల్లలు కలిగిన తల్లులకు మొదటి డోసు వేశామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement