Friday, November 22, 2024

ఎపిలో ముంద‌స్తు ఎన్నిక‌లు…అమీత్ షాతో జ‌గ‌న్ సుదీర్ఘ మంత‌నాలు..

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే రెండు వారాల వ్యవధిలో వరుసగా రెండుసార్లు ఢిల్లి వెళ్లి కేంద్ర పెద్దలను కలిశారు. ఇదే అంశంపై చర్చించినట్లు తెలుస్తున్నది. అదే నిజమైతే తెలంగాణతో పాటు నవంబరు, డిసెంబరు లోనే ఏపీలో కూడా ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముందస్తు వ్యూహంలో భాగంగానే జగన్‌ కేంద్రం నుండి రాష్ట్రానికి రావల్సిన నిధులను తీసుకొచ్చే ప్రయత్నాన్ని మరింత వేగవంతం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నల 17వ తేదీ సీఎం జగన్‌ ఢిల్లిd వెళ్లి ప్రధాని మోడీ, అమిత్‌ షా తదితర ముఖ్య నేతలతో భేటీ అయి వచ్చిన 48 గంటల్లోనే రాష్ట్రానికి సుమారు రూ.5 వేల కోట్లకు పైగా నిధులను కేంద్రం విడుదల చేసింది. తాజాగా బుధ, గురు వారాల్లో రెండు రోజులపాటు జగన్‌ ఢిల్లిdలో పర్యటించి అమిత్‌ షాతోపాటు ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. ఈ సందర్భం లోనూ పెండింగ్‌ నిధులపైనే ఆయన చర్చించడాన్ని బట్టి చూస్తుంటే కేంద్రం నుండి వీలైనంత త్వరగా రాష్ట్రానికి రావల్సిన అన్నిరకాల నిధులను రాబట్టి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న వ్యూహానికి మరింత పదునుపెడుతున్నట్లు తెలుస్తుంది.


ముందస్తుకు వెళ్లే యోచనలో ఉన్నారని పలువురు నేతలు సైతం పరోక్షంగా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. బడ్జెట్‌ సమావేశాల తరువాత సీఎం జగన్‌లో కూడా మరింత వేగం పెరిగింది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. అందులో భాగంగానే అసెంబ్లిd సమావేశాల ముగింపు సందర్భంగా జగన్‌ సంక్షేమ క్యాలెండర్‌ను కూడా ప్రకటించారు. తూ.చ.తప్పకుండా క్యాటెండర్‌లో ఉన్నప్రతి ప థకాన్ని లబ్దిదారులకు అందించి తీరుతామని స్పష్టంచేశారు. అప్పటి నుండే ఇటు పాలనా పరంగా అటు పార్టీ పరంగా జగన్‌ శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఢిల్లి పర్యటనలు కూడా పెరిగాయి. వీటన్నింటిని బట్టి చూస్తుంటే జగన్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉన్నారన్న సంకేతాలు వెలువడుతున్నాయి.

ఆరు నెలల ముందే ఎన్నికలకు వెళ్లే యోచన
రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు వచ్చే ఏడాది మేలో జరగాల్సి ఉంది. షెడ్యూల్‌ ప్రకారమైతే వచ్చే ఏడాదే ఎన్నికలు జరగాలి. అయితే, రాష్ట్రంలో తాజాగా చోటుచేసుకుంటున్న రాజకీయ సంఘటనలను బట్టి చూస్తుంటే సీఎం జగన్‌ ఆరు నెలల ముందే ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉన్నట్లు స్పష్టమౌతోంది. పార్టీ వర్గాల్లోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమవుతుంది. కొంత మంది సీనియర్‌ నేతలు తమకు ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని, అంత అవసరం తమ ప్రభుత్వానికి లేదని చెబుతున్నప్పటికీ లోపల మాత్రం పార్టీ శ్రేణులకు ఎప్పుడు ఎన్నికలు జరిగినా సిద్ధంగా ఉండాలంటూ పార్టీ పెద్దలు ప్రతి సమావేశంలోనూ సెలవిస్తూనే ఉన్నారు. వీటినిబట్టి చూస్తుంటే ప్రస్తుత ఏడాది నవంబరు, డిసెంబరులోనే ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. అదే జరిగితే తెలంగాణతోపాటు ఏపీలో కూడా అసెంబ్లి ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఏడాది నవంబరులో తెలంగాణకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ దిశగా ఎన్నికల సంఘం కూడా తెలంగాణ అసెంబ్లి ఎన్నికలకు కసరత్తును మొదలు పెట్టింది. అనధికారికంగా ఎన్నికల తేదీలపై కూడా ప్రచారం జరుగుతున్నది. నవంబరు 18వ తేదీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్‌ ప్రక్రియ మొదలవుతుంది. అదే నెల 28వ తేదీ నామినేషన్ల ఉపసంహరణ, డిసెంబరు 15న పోలింగ్‌, అదే నెల 19న ఫలితాల వెల్లడనున్నాయి. ఏపీలో కూడా తెలంగాణతోపాటు ఎన్నికలు నిర్వహిస్తే దాదాపుగా నవంబరు నుండే రాష్ట్రంలో కూడా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఢిల్లి పెద్దల చర్చల సారాంశం ఇదేనా ?
ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఢిల్లి వెళ్లిన ప్రతి సారి దాదాపుగా ప్రధాని నరేంద్రమోడీతో సగటున గంటన్నర పాటు సమావేశం అవుతూనే ఉన్నారు. హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో కూడా అంతే సమయం భేటీ అయి రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరపుతున్నారు. అయితే ఆర్ధిక వ్యవహారాతోపాటు రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు పంబంధించిన అంశాలపై కూడా చర్చిస్తున్నట్లు చెబుతున్నారు. అందులో భాగంగానే మార్చి నెలలో రెండు వారాల వ్యవధిలోనే రెండు సార్లు జగన్‌ ఢిల్లి వెళ్లారని అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement