Wednesday, November 20, 2024

Andhra Pradesh – ఈ నెలలోనూ బ్యాంక్ ఖాతాల్లోనే పెన్ష‌న్

ఏపీలో జూన్‌ నెలకు సంబంధించిన పెన్షన్‌ను కూడా బ్యాంక్ అకౌంట్ల‌లోనే వేస్తామ‌ని ప్ర‌భుత్వం క్లారిటీ ఇచ్చింది. జూన్‌ 1న పెన్షన్లను లబ్ధిదారుల అకౌంట్లలోనే జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక దివ్యాంగులు, నడవలేనివారు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మాత్రమే ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్లను అందజేయనున్నారు. ఎన్నిక‌ల కోడ్ నేప‌థ్యంలో వ‌లంటీర్ల సేవలపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. వారితో పెన్షన్లను పంపిణీ చేయించొద్దని ఆదేశించింది. దాంతో.. ఏప్రిల్ 1వ తేదీన గ్రామ, వార్డు సచివాలయాల్లో పెన్షన్లను అందజేశారు. మే నెలలో అయితే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు జమ చేశారు. జూన్‌ నెలకు సంబంధించి కూడా బ్యాంకు ఖాతాల్లోలనే వేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. మరోవైపు ప్రతిపక్ష పార్టీల నేత‌లు మాత్రం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి వెళ్లి పెన్షన్ డబ్బులు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement