Sunday, November 3, 2024

Andhra Pradesh – టెన్త్ స‌ప్లిమెంట‌రీ పరీక్ష‌ల ఫ‌లితాల వెల్ల‌డి… చేసుకోండి ఇలా..

అమరావతి: ఏపీ పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షలు 1.87 లక్షల మంది రాశారు. స‌ప్లిమెంట‌రీలో మొత్త 63 శాతం ఉత్తీర‌త సాధించారు.. www.bse.ap.gov.in వెబ్‌సైట్ల ద్వారా ఫలితాలను పొందవచ్చు. పాఠశాల లాగ్‌ఇన్‌లో సంబంధిత విద్యా సంస్థకు చెందిన విద్యార్థుల ఫలితాలు ఉంటాయని, మార్కుల జాబితాలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని టెన్త్ బోర్డు అధికారులు వెల్ల‌డించారు..

మొత్తం 1.87 లక్షల మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాశారు. ఏపీ వ్యాప్తంగా అడ్వెన్స్ సప్లిమెంటరీ అభ్యర్థుల ఉత్తీర్ణత శాతం 63.10. అందులో బాలికల ఉత్తీర్ణత శాతం 68.48శాతం ఉండగా.. బాలుల ఉత్తీర్ణత శాతం 59.32శాతంగా ఉంది. ప్రకాశం జిల్లా అత్యధికంగా 91.21శాతంగా ఉత్తీర్ణత సాధిస్తే లాస్ట్ ప్లేస్ లో కృష్ణా జిల్లా 40.56శాతంగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement