Tuesday, November 26, 2024

Andhra Pradesh – చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకుపోతుంది … ఎమ్మెల్యేల‌తో చంద్ర‌బాబు

కూట‌మి ఎమ్మెల్యేల‌తో చంద్ర‌బాబు
అసెంబ్లీ స‌మావేశాల నేప‌థ్యంలో భేటి
శాండ్ పాల‌సీలో ఎమ్మెల్యేల జోక్యం వ‌ద్దు
క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు ఎవ‌రూ పాల్ప‌డ‌వ‌ద్ద‌న్న ప‌వ‌న్ క‌ల్యాణ్

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – అమ‌రావ‌తి – అసెంబ్లీలో అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు త‌మ కూట‌మి ఎమ్మెల్యేల‌కు దిశ నిర్దేశం చేశారు.. అసెంబ్లీ కమిటీ హాలులో ఎన్డీఏ సభ్యులు సమావేశం అయ్యారు. ఈ స‌మావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన విధివిధానాలపై ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. గడిచిన ఐదేళ్లు వైసీపీ పెట్టిన ఇబ్బందులని సీఎం దృష్టికి తీసుకెళ్లారు ఎమ్మెల్యేలు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ.. ఈ విషయాంపై చట్ట ప్రకారం ముందుకెళ్దామని, చట్టం తన పని తను చేస్తుందంటూ సీఎం చెప్పారు. సాండ్ పాలసీలో ఎవరు జోక్యం చేసుకోవద్దంటూ సూచించారు. కలిసికట్టుగా అందరూ కలిసి పనిచేయాలంటూ దిశా నిర్దేశం చేశారు.

- Advertisement -

ఈ క్రమంలోనే ఎట్టి పరిస్థితుల్లోనూ కవ్వింపు చర్యలకు పాల్పడద్దని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో వేసే కమిటీల్లో అన్ని పార్టీలను కలుపుకోవాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement