Monday, November 25, 2024

Andhra Pradesh – అంగన్వాడీలతో ప్రభుత్వ చర్చలు విఫలం … సమ్మె యథాతథం

అమరావతి: డిమాండ్ల సాధన కోసం గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో సమ్మె కొనసాగించాలని అంగన్వాడీ కార్యకర్తలు నిర్ణయించారు.

వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని తదితర 11 డిమాండ్లతో అంగన్వాడీ కార్యకర్తలు నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్నారు. సమ్మె విరమించాలని కోరుతూ వారితో ప్రభుత్వం పలు దఫాలుగా చర్చలు జరిపింది. మంత్రులు బొత్స సత్యనారాయణ, అధికారుల కమిటీ శుక్రవారం సాయంత్రం మరోమారు చర్చలు జరిపినా ఎలాంటి పురోగతి కనిపించలేదు. వేతనాలు పెంచేది లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది.

చర్చల తర్వాత మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. అంగన్వాడీలు సమ్మె విరమిస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. మొత్తం 11 డిమాండ్లపై చర్చ జరిగిందని, కొన్ని డిమాండ్లను అంగీకరించామని తెలిపారు. ఇంకొన్ని డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా చూస్తామన్నారు. అంగన్వాడీ కేంద్రాలను స్వాధీనం చేసుకోమని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వలేదని మంత్రి పేర్కొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement