Friday, November 1, 2024

​Andhra Pradesh – ఇసుక అక్ర‌మ తవ్వ‌కాలు ఆపాల్సిందే … సుప్రీం కోర్టు

ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీం ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్ఛగా అక్రమ ఇసుక తవ్వకాలను సాగించిన ఏపీ ప్రభుత్వంపై సుప్రీం ధర్మాసనం మండిపడింది. అక్రమ ఇసుక తవ్వకాలను నిలిపివేయడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. కమిటీలో కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులను కూడా నియమించాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. నాలుగు రోజుల్లోపు అక్రమ ఇసుక రీచ్‌లను సందర్శించి వాటిని నిలిపివేయడానికి తగిన చర్యలను తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రతి జిల్లాలో ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక సెల్ లను కూడా ఏర్పాటు చేయాలని సుప్రీం ఆదేశించింది.

- Advertisement -

రూ.10 వేల కోట్ల విలువైన ఇసుక‌ను తవ్వేశారు

అక్రమ ఇసుక తవ్వకాలను నిషేదించడానికి పెద్ద ఎత్తున పబ్లిసిటీ ఇవ్వాలి. ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్లు, ఈ మెయిల్ ఐడీలను కూడా ఏర్పాటు చేయాలి. తమ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే కోర్టు థిక్కార చర్యలను తీసుకుంటాం. కమిటీలోని అధికారులు సుప్రీంకోర్టు నియమించిన అధికారులుగా గుర్తెరిగి విధులను నిర్వర్తించాలి. ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోండి’’ అని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో యథేచ్చగా అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని కేంద్ర పర్యావరణ, అటవీశాఖ ధృవీకరించింది. ఆ మేరకు మధ్యంతర నివేదికను సమర్పించింది. 10 వేల కోట్ల రూపాయల మేరకు అక్రమ ఇసుక రవాణా జరిగిందని ప్రతివాది తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా.. సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఏపీ ప్రభుత్వం కొనసాగిస్తున్న అక్రమ ఇసుక తవ్వకాలను ఫోటోలు, ఆధారాల సహా ప్రతివాది దండా నాగేంద్ర కుమార్ నేడు సుప్రీం ముందు ఉంచారు. జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం విచారించే నేడు మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement