Friday, November 22, 2024

Andhra Pradesh – ముంద‌స్తు వ్యూహంతోనే దాడులు – ఎపిలో ఘ‌ర్ష‌ణ‌ల‌పై సిట్ నివేదిక‌


ప్రాధ‌మిక రిపోర్ట్ లు డిజిపికి అంద‌జేసిన సిట్ అధినేత‌
మొత్తం 33 ప్రాంతాల‌లో ఘ‌ర్ష‌ణ‌లు జ‌రిగిన‌ట్లు నిర్ధార‌ణ‌
చాలా చోట్ల ఎఫ్ ఐ ఆర్ లో ఉన్న సెక్ష‌న్లు మార్చాల్సిందే
బాధ్యులైన అధికారుల‌పైనా చ‌ర్య‌ల‌కు సిఫార్స్

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల రోజు, తర్వాత జరిగిన హింసాత్మక ఘటనపై నివేదిక‌ను సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్‌లాల్ ఎపి డిజిపి హ‌రీశ్ గుప్తాకు నేడు అంద జేశారు.. ఇది ప్రాధ‌మిక నివేద‌క అని, త్వ‌ర‌లో పూర్తి స్థాయి నివేదిక ఇస్తామ‌ని వినీత్ వెల్ల‌డించారు.. రాష్ట్రంలో 33 చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయని నివేదిక స్ఫ‌ష్టం చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కూ నమోదైన ఎఫ్ఎర్అలో కొన్ని సెక్షన్ల మార్పుపై సిఫార్సు చేసింది సిట్.. . పల్నాడు జిల్లాలోని మాచర్ల, నరసరావుపేట, గురజాల ప్రాంతాల్లోని మారణాయుధాలు, నాటు బాంబు య‌దేచ్చ‌గా వాడుతున్నార‌ని ఈ క‌మిటీ తేల్చింది..

- Advertisement -

తిరుపతిలోని టీడీపీ అభ్యర్థి నానిపై దాడి, తాడిపత్రిలో జరిగిన దాడుల వెనుకు ముంద‌స్తు వ్యూహం ఉంద‌ని త‌మ విచార‌ణ‌లోతేలింద‌ని సిట్ చీఫ్ వినీత్ వెల్ల‌డించారు.. ఈ ఘ‌ట‌న‌ల‌లో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన కేసుల‌లో కొన్ని సెక్ష‌న్ల‌ను మార్చాల‌ని అన్నారు. ఘటనలు జరగడానికి బాధ్యులు ఎవరు? అధికారులు ఏ విధంగా వ్యవహరించారు? ఏ నేతలకు అనుగుణంగా వ్యవహరించారు? అనేదానిపై ఫోకస్ చేశామ‌న్నారు..అలాగే జూన్ నాలుగు తర్వాత హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉందా అనేది కూడా రిపోర్టులో ప్రస్తావించారు. తిరుపతిలో దాడి జరిగిన గురించి చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిని సిట్ అధికారులు విచారించ‌మ‌న్నారు. వివ‌నాల‌పే నివేదిక‌లో పొందుప‌రిచామ‌న్నారు సిట్ చీఫ్…

Advertisement

తాజా వార్తలు

Advertisement