Tuesday, November 26, 2024

Andhra Pradesh – రాష్ట్రంలో గణనీయంగా తగ్గిన నేరాలు – అదుపులో శాంతి భద్రతలు .. డిజిపి రాజేంద్రనాథ్‌ రెడ్డి

కర్నూల్. ( ప్రభన్యూస్‌ బ్యూరో) – రాష్ట్రంలోగత మూడేళ్లలో ఎన్నడూ లేని విధంగా శాంతి భద్రతలు అదుపులో ఉన్నట్లు రాష్ట్ర డిజిపి కేవి.రాజేంద్ర నాథ్‌రెడ్డి వెల్లడించారు. కర్నూలులో కెఎస్‌. వ్యాస్‌ అడిటోరియంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా గత ఆరునెలల కాలంలో రాష్ట్రంలో క్రైమ్‌ రేటు ఏ విధంగా ఉందని పరిగణలోకి తీసుకుంటే బాగ తగ్గుదల కనిపించిందన్నారు. లా అండ్‌ ఆర్దర్‌ కంట్రోల్‌ ఉన్నట్లు పేర్కొన్నారు.- ముఖ్యంగా కర్నూలు, నంద్యాల జిల్లాలో సైబర్‌ నేరాల అదుపుతో పాటు క్రె-మ్‌,ఫంక్షనల్‌ వర్టికల్స్‌లపై ఎస్‌.పిలు, డిఎస్‌పిలతో పాటు డీజీపీ కేవి. రాజేంద్ర నాథ్‌రెడ్డి సమీక్ష నిర్వహించినట్లు వెల్లడించారు. నేర నియంత్రణకు తీసుకోవాల్సిన విషయాలపై ఉమ్మడి జిల్లా అడిషనల్‌ ఎస్‌పిలు, డిఎస్‌పిలు, సిఐలకు పలు సూచనలు, సలహాలు చేసి దిశ, నిర్దేశం చేసినట్లు వెల్లడించారు. ఈ రెండు జిల్లాలలో గత ఆరునెలల కాలంలో క్రైమ్‌ ఏ విదంగా ఉందన్న విషయాన్ని పరిశీలించామన్నారు.

గత మూడేళ్లలో జనవరి నుంచి జూన్‌ వరకు నమోదైన కేసులను, గత జనవరి నుంచి ఇప్పటి వరకు నమోదైన కేసులను పరిగణలోకి తీసుకొని పరిశీలించడం జరిగిందన్నారు. వీటినిబట్టి ప్రస్తుతం నేరాల నమోదు నిర్ధారిత ప్రమాణాలలోనే ఉన్నాయన్నారు. మొత్తంగా పరిశోధనలో ఉన్న కేసులు తగ్గాయన్నారు. హాత్యలు, దొంగతనాలు, హాత్యయత్నా కేసులలో బాగ తగ్గుదల కనిపించిందన్నారు. ఉదహారణకు కర్నూలు జిల్లాలో 27 శాతం తగ్గుదల కనిపించగా, నంద్యాలలో 25 శాతం తగ్గుదల ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పరిగణలోకి తీసుకుంటే కర్నూలు జిల్లాలో 46 శాతం, నంద్యాలలో 55 శాతం తగ్గుదల కనిపించిందన్నారు. రోడ్‌ ప్రమాదాలు 39 శాతం తగ్గిందన్నారు. నంద్యాలలో కూడ బాగ తగ్గుదల కనిపించిందన్నారు

. రోడ్‌ ప్రమాదాలు తగ్గేందుకు ప్రధానంగా పోలీసుశాఖ తీసుకున్న చర్యలు సత్‌ఫలితాలను ఇచ్చాయన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఎక్కువగా రోడ్‌ ప్రమాదాలు జరిగే స్పాట్‌లను గుర్తించి ఆయా ప్రదేశాలో అనేక చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రజలకు కూడ పోలీసుశాఖ ద్వార అవగాహాన కల్పించడం రోడ్‌ ప్రమాదాలను నివారించగలిగామన్నారు. వీటితో పాటు ఫోక్సో, ఎస్సీ, ఎస్టీల కేసుల్లోను గణనీయమైన తగ్గుదల ఉందని వివరించారు. నంద్యాలలో 27 శాతం, కర్నూలులో 36 శాతం తగ్గడం జరిగిందన్నారు. దిశయాఫ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రజలు వాటిని విరివిగా వినియోగించడం జరిగిందన్నారు. నేర అంశాలపై యాఫ్‌కు మెసెజ్‌ రాగానే పోలీసులు వెంటనే స్పందించిన బాదితులకు అండగా నిలువడం జరిగిందన్నారు. గత ఏడాది రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా కన్విక్షన్‌ బేస్టు పోలీసింగ్‌ ను ఏర్పాటు చేశామన్నారు. దీంతో మంచి ఫలితాలు వచ్చాయన్నారు.

అంతటితో కాకుండా కేసుల పరిష్కారంలో ప్రత్యేక చోరవ చూపడం వల్ల అనేక కేసుల్లో నిందితులకు జైలు శిక్షలు పడిన విషయాన్ని పోలీస్‌ బాస్‌ గుర్తుచేశారు. మేజర్‌ గ్రేవ్‌ కేసులలో 120 వరకు నమోదు కాగా, వీటిలో దాదాపు వంద వరకు పరిష్కరించిన విషయంను ఆయన వివరించారు. వీటిలో డెత్‌ పెనాల్టీ 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు కూడ జైలు శిక్షలు పడ్డాయన్నారు. రాష్ట్రంతో పాటు ఉమ్మడి జిల్లాలో నేరాల తీవ్రతను అరికట్టేందుకు రౌడీషీటర్‌లు, క్రిటికల్‌ వ్యక్తులను గుర్తించి వారిపై పిడియాక్టు నమోదు చేయడం జరిగిందన్నారు. వీరిలో ఎక్కువగా మద్యం, గుట్కా, ఇతర చీకటి వ్యాపారం చేసే వ్యక్తులతో పాటు భూ తగదాలు, గ్రామాలలో అలజడులు, తగాదాలకు కారణమైన వ్యక్తులను గుర్తించి వారిపై పిడియాక్టు నమోదు చేయడం జరిగిందన్నారు.

- Advertisement -

ఇలా ఇప్పటి వరకు రాష్ట్రంలో 35 మందిపై నమోదు చేసి వారిని జైళ్లకు పంపిన విషయంను ఆయన గుర్తుచేశారు. ఈ ఏడాది కూడ పిడి యాక్టులు సిద్దం చేశామన్నారు. ప్రస్తుతం నంద్యాలలో ముగ్గురు వ్యక్తులను పిడియాక్టు కింద నమోదు చేయనున్నట్లు వివరించారు. ప్రతి పోలీసు స్టేషన్‌ పరిదిలో నమోదైన కేసులను పరిష్కరిస్తూనే అక్కడి డిఎస్‌పిలు, సిఐలు, ఎస్‌ఐలు ప్రతి ఒక్కరు 10 ప్రత్యేక కేసులను తీసుకొని పరిష్కరించేలా ఆదేశించడం జరిగిందన్నారు. ఈ నిర్ణయం మంచి ఫలితం ఇస్తుందన్నారు. పాస్టు ట్రాక్‌ కోర్టుల ద్వార 16వేల కేసులు అందజేస్తే 1400ల కేసులు ట్రయిల్‌ పూర్తయి 62 శాతం కేసుల్లో శిక్షలు పడ్డాయన్నారు.

సిఐలు, ఎస్‌ఐలకు పదొన్నతులు :
కొంత మంది సిఐలు పదొన్నతుల విషయంలో ఆర్జీలు ఇవ్వడం జరిగిందన్నారు. త్వరలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న డిఎస్‌పిల స్థానంలో వారికి పదొన్నతులు కల్పించనున్నట్లు తెలిపారు. వారం రోజుల్లో కొంతమంది ఎస్‌ఐలకు సిఐలుగా పదొన్నతులు కల్పించనున్నట్లు తెలిపారు. కర్నూలు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌, ఏసిబి, మరి కొన్ని ముఖ్యమైన విభాగాలలో డిఎస్‌పి స్థానాలు ఖాళీ అంశంను ఆయనకు పాత్రికేయులు గుర్తుచేయగా, వాటిని త్వరలో భర్తి చేస్తామన్నారు. మ్యాన్‌ మిస్సింగ్‌ కేసులలో ఎంతో పురోగతి ఉందన్నారు. రాష్ట్రంలో ఎన్‌సిఆర్‌బి డేటా ప్రకారం 26వేల మ్యాన్‌ మిస్సింగ్‌ కేసుల లో 23300 మందిని గుర్తించడం జరిగిందన్నారు. వారు ట్రేస్‌ అయి ఇళ్లకు చేరుకున్నారన్నారు. ట్రేస్‌ అయ్యే కొద్ది కేసులు పూర్తిగా తగ్గుతూ వస్తాయని డిజిపి వెల్లడించారు..ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పోలీస్‌ అధికారులు మరింత అప్రమత్తతో విధులు నిర్వహించాల్సి ఉంటు-ందని తెలిపారు. ముఖ్యంగా వీఐపీల పర్యటనల సందర్భంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మీడియా, సోషల్‌ మీడియాలలో వచ్చే ప్రతికూల వార్తలను ఎప్పటికప్పుడు పరిశీలించి వెంటనే వాటిపై తగు వివరణ ఇవ్వలన్నారు.
సమావేశంలో నంద్యాల, కర్నూలు జిల్లాల ఎస్‌పిలు కె. రఘవీర్‌రెడ్డి, జి. కృష్ణకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement