Monday, November 25, 2024

FLASH: రేపటి నుంచే ఒంటి పూట బడులు

ఆంధ్రప్రదేశ్ లో రేపటి నుంచి ఒంటి పూట బడులు అమలు కానున్నాయి. రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా ఏపీ విద్యాశాఖ ఏప్రిల్ 4 నుంచి ఒంటి పూట బడుల నిర్వహణకు ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా ఒకటి నుంచి తొమ్మిదో తరగతులకు ఒంటి పూట బడులు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఉదయం 07.30 నుంచి 11.30 వరకు తరగతులను నిర్వహించనున్నట్లు తెలిపింది. ఆ తర్వాత మధ్యాహ్న భోజనం పెట్టి విద్యార్థులను ఇంటికి పంపించనున్నారు. ఏప్రిల్ 27 నుంచి పదో పరీక్షలు జరగనున్న కారణంగా వారికి తరగతులు యథావిధిగా జరగనున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారులు తగు చర్యలు తీసుకోవాలని సూచించింది.

కాగా, ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతూ సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో విద్యార్థుల ఆరోగ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం హాఫ్ డే స్కూళ్లను ప్రారంభించిన సంగతి తెలిసిందే. వేసవి తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా హాఫ్ డే స్కూల్స్ నిర్వహించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement