ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2021-22 విద్యా సంవత్సరానికి సిలబస్ తగ్గిస్తూ పాఠశాల విద్యాశాఖ సర్క్యులర్ జారీ చేసింది. 3-10 తరగతులకు సిలబస్ తగ్గిస్తూ సర్క్యులర్ లో పేర్కొంది. 3-9 తరగతులకు 15 శాతం, 10వ తరగతికి 20 శాతం సిలబస్ తగ్గించింది. పాఠశాల పనిదినాల అకడమిక్ కేలండర్ 31 వారాల నుంచి 27 వారాలకు కుదించారు. రెండు భాగాలుగా అకడమిక్ కేలండర్ రూపకల్పన చేశారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ చినవీరభద్రుడు సర్క్యులర్ జారీ చేశారు.
కాగా, రాష్ట్రంలో కరోనా కారణంగా మూతపడిన స్కూళ్లను ఆగస్ట్ 16 నుంచి పున:ప్రారంభమైన సంగతి తెలిసిందే. స్కూళ్లు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారినపడ్డారు.
ఇది కూడా చదవండి: దళిత బంధు పథకం.. మరో నాలుగు మండలాల్లో అమలు