ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు భారీగా పెరిగాయి. ఇవాళ ఒక్కరోజే 4,955 మందికి వైరస్ సోకగా.. ఒకరు మృతి చెందారు. కరోనా నుంచి 397 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 22,870 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 35,673 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు.
విశాఖ జిల్లాలో 1,103, చిత్తూరు 1,039, నెల్లూరు 397, కడప 377, గుంటూరు 326, కర్నూలు 323 చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ వల్ల పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరు మరణించారు.