ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 61,363 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1,361 కరోనా కేసులు నమోదైయ్యాయి. కోవిడ్ తో మరో 15 మంది మృతి చెందారు. మొత్తం 1,288 మంది బాధితులు కోలుకోగా.. రాష్ట్రంలో ప్రస్తుతం 14,510 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,24,603కి చేరింది. ఇందులో 19,96,143 బాధితులు పూర్తిగా కోలుకున్నారు. మొత్తం 13,950 మంది వైరస్ కారణంగా చనిపోయారు.
గడిచిన 24 గంటల్లో నెల్లూరులో 282, చిత్తూరులో 203, అనంతపురంలో 26, తూర్పుగోదావరిలో 143, గుంటూరులో 131, కడపలో 104, కృష్ణాలో 99, కర్నూలులో 13, ప్రకాశంలో 87, శ్రీకాకుళంలో 25, విశాఖపట్నంలో 73, విజయనగరంలో 26, పశ్చిమగోదావరిలో 149 కేసులు నమోదయ్యాయి. కోవిడ్ వల్ల కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ముగ్గురు, తూర్పు గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు, చిత్తూరు, కడపలో, పశ్చిమ గోదావరిలో జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.
ఇది కూడా చదవండి: మద్యంపై ఉద్యమం చేయడమేంటి?