మందు బాబులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలో మద్యం ధరల్ని ప్రభుత్వం 15- 20శాతం తగ్గించింది. ఒక్కో మద్యం కేసు మూలధరపై వ్యాట్, స్పెషల్ మార్జిన్ రేటు, అదనపు ఎక్సైజ్ సుంకం, అదనపు కౌంటర్‌వయిలింగ్ డ్యూటీలను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేశారు. బ్రాండ్‌ను బట్టి క్వార్టర్‌పై కనీసం రూ.20 నుంచి రూ.50 వరకూ, ఫుల్ బాటిల్‌పై రూ.120 నుంచి రూ.200 వరకూ తగ్గించింది. అన్ని రకాల బీర్లపై రూ.20- రూ.30 వరకూ ధర తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
చీప్ లిక్కర్‌లోని కొన్ని రకాల బ్రాండ్ల ధర తెలంగాణ కంటే ఏపీలోనే తక్కువగా, మరికొన్ని బ్రాండ్ల ధర తెలంగాణతో సమానంగా ఉండేలా సవరించారు. ధరల తగ్గింపు ఆదివారం నుంచే అమల్లోకి రానుంది. చీప్ లిక్కర్ రేట్లు గణనీయంగా తగ్గటం వల్ల వినియోగం మరింత పెరిగి.. ప్రభుత్వానికి లభించే ఆదాయమూ పెరగనుంది. మద్యం అక్రమ రవాణా, స్మగ్లింగ్ నియంత్రణ, నాటుసారా అరికట్టేందుకు మద్యం ధరలు తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..