Tuesday, November 19, 2024

Andhra Pradesh – చిత్తూరు జిల్లాను పులివెందులుగా మార్చారు … చెవిరెడ్డిపై పులివ‌ర్తి ఆగ్ర‌హం ..

చంద్ర‌గిరి – ఎంతో ప్రశాంతంగా ఉండే చోటా కులాలు, మతాలు పేరుతో చెవిరెడ్డి భాస్కరెడ్డి చిచ్చు పెట్టారు అంటూ చంద్రగిరి టీడీపీ ఇన్ చార్జ్ . నియోజ‌క‌వ‌ర్గ అభ్య‌ర్ధి పులివర్తి నాని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.. రాడ్ తో, కర్రలతో నాపై దాడి చేస్తున్నారని సమాచారం ఇచ్చినా కూడా పోలీసులు సరైన విధంగా స్పందించ లేదు అంటూ ఆయన పేర్కొన్నారు.

తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్శిటీలోని స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించేందుకు వెళ్లిన సమయంలో ఆయనపై దాడి జరిగింది. ఈ దాడిలో నానితో పాటు ఆయన భద్రతా సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. గాయ‌ప‌డిన నానీని చికిత్స కోసం టిమ్స్ లో చేర్చారు.. నేటి మ‌ధ్యాహ్నం ఆయ‌న‌ను హాస్ప‌ట‌ల్ నుంచి డిశ్చార్జ్ చేశారు… అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, చంద్రగిరి ప్రజలు కోసం, నా పార్టీ కేడర్ కోసం చావడానికి సిద్దం అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఎమోషనల్ అయ్యారు.

- Advertisement -


.

చెవిరెడ్డి అరాచాలకు ఈ ఎన్నికలతో ముగింపు పడుతుందని., మీ కొట్టారు తీసుకున్నాం.. మా టైం వస్తుంది అప్పుడు మేము చూపిస్తాం.. ఎవరిని వదలిపెట్టాము.. అంటూ ఘాటుగా స్పందించారు. చంద్రగిరికి పులివెందుల సంస్కృతి తీసుకోవచ్చారని.. నాపై జరిగిన దాడి విడియోలు ఎవరు చూసినా చెబుతారు అని., ఎలా చంపాలని ప్లాన్ వేసారని.. జూన్ 5 తేదినా మేము ఎంటో కూడా చెబుతాం అంటూ వైస్సార్సీపీ నాయకులపై కాస్త ఘాటుగా స్పందించారు. కాగా, డిశ్చార్జ్ అయిన వెంటనే ఆయన గాయపడిన తన గన్ మెన్ ను కలిసి పరామర్శించారు.

మరోవైపు, స్విమ్స్ ఆసుపత్రిలో పులివర్తి నానిని మాజీ మంత్రి, పలమనేరు టీడీపీ అభ్యర్థి అమర్ నాథ్ రెడ్డి కలిసి, పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నానిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. చెవిరెడ్డి కుటుంబానికి ఓటమి భయం పట్టుకుందని… అందుకే దాడులకు తెగబడ్డారని మండిపడ్డారు. పోలీసులు కూడా వైసీపీకి అనుకూలంగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దాడికి పాల్పడిన వైసీపీ నేతలను వదిలేసి, టీడీపీ నేతలను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. నానిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement