Monday, November 18, 2024

Andhra Pradesh – పిన్నెల్లి కోసం పోలీసుల వేట.. హైదరాబాద్ లో గాలిస్తున్న ప్రత్యేక బృందాలు

ఎన్నిక‌ల సంఘం ఆదేశాలతో ఏపీ పోలీసులు రంగంలోకి దిగారు. మొత్తం 3 చట్టాల పరిధిలో 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఐపీసీ, ఆర్పీ, పీడీపీపీ చట్టాల పరిధిలో సెక్షన్లు నమోదయ్యాయి. ఐపీసీ 143, 147, 448, 427, 353, 452, 120బీ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఈ నేరం రుజువైతే ఏడేళ్లు జైలు శిక్ష ప‌డే అవ‌కాశం ఉందంటున్నారు న్యాయ‌నిపుణులు . ఇది ఇలా ఉంటేపిన్నెల్లి అరెస్ట్ కోసం ప్రత్యేక బృందాన్ని హైదరాబాద్ కు పంపించారు. ఇటు మాచ‌ర్ల‌లోనూ, ఆయన స్వ‌గ్రామంలోనే భారీగా పోలీసులు మోహ‌రించారు.. అత‌డి బంధువుల ఇళ్ల‌లో సైతం పోలీసులు గాలిస్తున్నారు.. కానీ.. కేంద్రం సీరియస్ అయిన విషయం తెలిసి.. పిన్నెల్లి అజ్ఞాతంలోకి వెళ్లారు. మొబైల్ స్విచ్ఛాఫ్ లో ఉండటంతో పిన్నెల్లి ఆచూకీ కోసం వేట మొదలుపెట్టారు.

ఇదిలా ఉండగా.. పోలింగ్ తర్వాత పిన్నెల్లి సోదరులు హైదరాబాద్ కు వెళ్లిపోయారు. మాచర్ల ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అవడం, పోలీసులు అరెస్ట్ చేసేందుకు వస్తున్నారని తెలిసి పిన్నెల్లి బ్రదర్స్ హైదరాబాద్ నుంచి ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేశారు . సంగారెడ్డి వద్ద పోలీసులకు పిన్నెల్లి కారు దొరకగా పోలీసులకు దొరక్కుండా పారిపోయినట్లు సమాచారం. పిన్నెల్లి డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆయన వదిలేసి వెళ్లిన మూడు కార్ల‌ను ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కందిలోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌కు తరలించారు. పిన్నెల్లి కారు డ్రైవర్‌ను, అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. పిన్నెల్లికి ఆశ్రయం ఇచ్చిందెవరు? ఎటు వెళ్లాడు ? అనే వివరాలపై విచారణ చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement