Wednesday, November 20, 2024

Andhra Pradesh – ఇక ఏ వన్ పెద్ధిరెడ్డే…!? ఎఫ్ ఐ ఆర్ భయం ….

ఏపీలో వైనాట్ 175 స్లోగన్ ..మోత ఆగింది. కానీ విజయం మాత్రం వైసీపీదే.. 151 మార్కు దాటుతుందని సొంత సర్వేలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నా.. నిన్నటి వరకూ ఫైర్ బ్రాండ్ ఇమేజీతో ఘర్జించిన నేతలందరూ… మౌన దీక్షను బూనారు. కౌంటింగ్ కౌంట్ డౌన్ ముగిసే వరకూ కొందరు విదేశీయానంలో కాలక్షేపం చేస్తుంటే… మరి కొందరు అగ్రనేతలను ఎఫ్ ఐఆర్ భూతం వెంటాడుతోంది. వీరిలో పెద్దాయన పెద్దిరెడ్డి పేరు మార్మోగుతోంది. ఒకవేళ వైసీపీ అధికారంలోకి రాకపోతే… కూటమి గెలిస్తే తొలి ప్రధాన నిందితుడిగా పెద్దిరెడ్డి పేరిట ఎఫ్ ఐఆర్ ప్రత్యక్షం కావటం తథ్యమమని ప్రచారం తెరమీదకు వచ్చింది.

ఎందుకంటే…

పెద్దిరెడ్డి హావభావాలు… ఆహంభావ స్వరమే.. ఈ చర్చకు దారి తీసింది. చంద్రబాబు నాయుడితోపాటు తెలుగుదేశం పార్టీ నేతలను వేధించడంలో పెద్దిరెడ్డి ముందుండేవారు. చిత్తూరు జిల్లా అంగళ్లులో బాబుపై హత్యాయత్నం స్థాయిలో అల్లరి మూకలు చెలరేగిపోయాయి. వాటివెనక పెద్దిరెడ్డి ఉన్నారనేది బహిరంగ రహస్యం. కుప్పంలో చంద్రబాబును ఓడించడానికి పావులు కదిపారు. హిందూపురం నుంచి బాలకృష్ణను వెళ్లగొడతానన్నారు. వందల సంఖ్యలో టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టించారు. ఇక ప్రభుత్వం మారితే… టార్గెట్ అయ్యేది కూడా పెద్దిరెడ్డే. పోలింగ్ కు ముందే పెద్దిరెడ్డితోపాటు ఆయన కుమారుడు మిథున్ రెడ్డి కూడా సైలెంట్ అయ్యారు.

- Advertisement -

ఆర్థిక మూలాపై దృష్టి

వైసీపీ ప్రభుత్వ హయాంలో పెద్దిరెడ్డి వ్యవహరించిన తీరుతో ప్రభుత్వం మారిన తర్వాత ఆయన వ్యాపారాలన్నీ మూతపడటం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. లొసుగులతో నిండిన వ్యాపారాలు కావడంతో ప్రభుత్వం మారితే కచ్చితంగా టార్గెట్ అవుతానని పెద్దిరెడ్డి కూడా భావించినట్లున్నారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ పీలేరులో మంత్రి పెద్దిరెడ్డి మాఫియా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement