( ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి) – ఏపీ శాసనసభా వ్యవహరాల శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ బుధవారం బాధ్యతల స్వీకరించారు.. అమరావతిలోని తన చాంబర్ లో వేద పండితుల వేదమంత్రోత్సవాల నడుమ పయ్యావుల బాధ్యతలు చేపట్టారు.. అనంతరం అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఫైలుపై తొలి సంతకం చేశారు.. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, మంత్రిత్వ శాఖ అధికారులు ఆయనకు అభినందనలు తెలిపారు..
అనంతరం టీడీపీ శాసన సభా పక్ష కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి మంత్రి నివాళులర్పించారు. శాసనసభ సమావేశాల్లో రాష్ట్ర అభివృద్ధికి, ప్రజాసంక్షేమానికి సంబంధించి అర్థవంతమైన చర్చలు జరగాలని ఆకాంక్షించారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో రాష్ట్ర ప్రజలకు జవాబుదారీతనంతో కూడిన పారదర్శక పాలన అందించేందుకు కృషి చేస్తామన్నారు. సభకు మాజీ సీఎం జగన్ రావాలన్నారు. సమస్యలపై ఆయన మాట్లాడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. సభలో స్వపక్షమైనా.. విపక్షమైనా తామేనన్నారు. ప్రజల కోసం ఏ పాత్ర పోషించడానికైనా సిద్ధంగా ఉంటామని తెలిపారు.