Sunday, June 30, 2024

Andhra Pradesh – టిడిపి అధ్య‌క్ష‌డిగా ప‌ల్లా బాధ్య‌త‌లు స్వీక‌ర‌ణ

గాజువాక అసెంబ్లీ స్థానం నుంచి రికార్డు మెజారిటీతో ఎన్నికైన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా నేడు బాధ్యతలు చేపట్టారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో లాంఛనంగా బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ రాష్ట్ర నాయకత్వ బాధ్యతలను తనకు అప్పగించిన చంద్రబాబు, నారా లోకేశ్ లకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు.

తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించి ప్రభుత్వంలో భాగం చేయడమే ప్రధాన కర్తవ్యంగా పనిచేస్తానన్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తానని తెలిపారు. ఐదేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లోనూ ఇంతే మెజార్టీతో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేలా కృషి చేస్తానని చెప్పారు. రాజకీయ ప్రేరేపిత కేసుల్ని కొట్టివేయిస్తామన్నారు. పార్టీ శ్రేణులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
కాగా, ఎపి అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన ప‌ల్లాకు ఆ పార్టీ జాతీయ కార్య‌ద‌ర్శి నారా లోకేష్ అభినంద‌న‌లు తెలిపారు.

- Advertisement -

:

Advertisement

తాజా వార్తలు

Advertisement