కర్నూలు జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపింది. జిల్లాలోని డోన్‌లో క్షుద్రపూజలు జరిగినట్లు గ్రామస్తులు గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు పంట పొలాల్లోకి వెళ్లే మార్గంలో క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్ళను చూసిన రైతులు ఆందోళన చెందారు. ఘటనా స్ధలంలో నల్లకోడిని బలి ఇచ్చిన రక్తపు ఆనవాళ్లు కనిపించాయి. ముగ్గులతో అమ్మవారి రూపం వేసి ఉండడంతో పాటు, అక్కడ పూజ చేసిన కుంకుమ, పసుపు, నిమ్మకాయలు, నూనె, టెంకాయలను రహదారికి అడ్డంగా పడేశారు. అయితే గుప్త నిధుల కోసం ఇలా చేశారా.. లేక చేతబడి చేయడానికి క్షద్రపూజలు చేశారా అని రైతులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. పంట పొలాల్లోకి వెళ్లే మార్గంలో క్షుద్రపూజల చేసిన ఆనవాళ్లు ఉండటంతో రైతులు, వ్యవసాయ కూలీలు భయాందోళనకు గురవుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital