Sunday, November 24, 2024

Andhra Pradesh – విస్పోటనం … నట సార్వహౌముడి విప్లవోద్యమం – ప్రతి పేదింటిలో కూడు.. గూడు.. గుడ్డ


ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి – అభవిక్త ఆంధ్రప్రదేశ్‌లో.. ఆన్న ఎన్డీఆర్ నేతృత్వంలో ఆవర్భించిన తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ అహంభావాన్ని ధ్వంసం చేసింది. ముఖాన రంగులేసుకునేటోడికి రాజకీయం తెలుసా? పరిపాలన తెలుసా? అని పరిహాసం చేసిన కాంగ్రెస్ పార్టీ… 1983 ఎన్నికల్లో ఖంగుతింది. పార్టీని స్థాపించిన 9 నెలల్లో నవతర ప్రజాప్రతినిధులను ఎన్డీఆర్ తెరమీదకు తీసుకువచ్చారు. అప్పటికే 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఆధీనంలో రెడ్డి రాజులు సామంతులుగా వ్యవహరించగా.. నందమూరి తారక రామారావు సామాజిక న్యాయాన్ని ఆవిష్కరించారు. రెడ్డి, కమ్మ, కాపు, బీసీ, ఎస్పీ, ఎస్టీ, అగ్రవర్ణాలు.. అనే తేడా లేకుండా నయా ప్రజాప్రతినిధులను రంగంలోకి తీసుకొచ్చారు. ఇక.. ప్రజల కోసమే.. పేదల బతుకు కోసమే తన విధి విధానాలను అమలు చేశారు. కరవు కాటకాలతో 12 జిల్లాల్లో జనం అల్లాడి పోతుంటే.. సుభిక్ష జిల్లాల నుంచి అన్నార్తుల ఆకలి తీర్చే యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. అదే కిలో రెండు రూపాయల పథకం. కోటి ఇరవై లక్షల మందికి లబ్ధి చేకూరింది. ఇంకా .. ఆడపిల్లకు తండ్రి ఆస్తిలో సమాన హక్కును కల్పించిన గొప్ప స్త్రీవాదిగా నిలిచారు. ఇలా ఎన్నో విప్లవాత్మక మార్పులకు అన్న ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయింది.

తొలి ఎన్నికల్లో అన్నీ సంచనాలే..

- Advertisement -

1983 జనవరి 5న జరిగిన ఎన్నికల పోలింగ్‌ లో తెలుగుదేశం సూపర్‌ హిట్‌ కొట్టింది. ఈ ఎన్నికల్లో అభ్యర్తులెవరో ఓటర్లకు తెలీదు. తెలిసింది ఒకటే సైకిల్ గుర్తు.. ఆ గుర్తుకే ఓటు గుద్దారు. ప్రతి ఓటరు తాను ఎన్స్‌టి.ఆర్‌. కే ఓటు వేసినట్టు భావించాడు. ప్రతిపక్షం అంచనాలను, రాజకీయ పండితులు, జాతక రత్నాల ప్రతికూల అంచనాలను మించితెలుగుదేశం పార్టీ 203స్థానాలను కైవశం చేసుకుంది. రాజకీయ అనుభవం లేని నాయకులందరూ గెలిచారు. అభ్యర్థుల్లో మూడు వంతులకు పైగా కొత్తవారే. ప్రజాస్వామ్య చరిత్రలో ఇదో అపూర్వఘట్టం.

అవును ఇదొక అపూర్వ ఘట్టం

రాష్ట్రంలోని 294 నియోజకవర్గాలలో టీడీపీ అభ్యర్థులు ఎవరో తెలీదు.ఫలానా వ్యక్తి ఫలానా నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచారని రేడియోలో వార్తలు విన్న తరువాతే జనానికి తమ నాయకుడెవరో తెలిసింది. గెలిచిన తెలుగుదేశం ఎమ్మెల్యేల్లో అత్యధికులు కొత్త ముఖాలే. పోటీ చేసిన టీడీపీ అభ్యర్థుల్లో 176 మంది విద్యాకులున్నారు. వీరిలో అత్యధికులు యువకులే. ఇందులో 125 మంది పట్టభుద్రులు, 20 మంది వైద్య పట్టభద్రులు, 8మంది ఇంజనీర్లు, 28మంది పోస్టు గ్రాడ్యుయేట్లు, కేవలం 9 నెలల ప్రాయంతో తెలుగుదేశం పార్టీ వందేంద్ల చరిత్ర కలిగిన జాతీయ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించింది. విశ్వవిఖ్యాత ఎన్నికల విజేతగా అన్న ఎన్టీఆర్ విరాజిల్లారు. కనివిని ఎరుగని ప్రజా రాజకీయాలకు నాంది పలికారు. ప్రజలమధ్యకు రాజ్ భవన్ ను తీసుకు వచ్చారు. . రాజకీయాలకు కొత్త నిర్వచనం పలికారు,హైదరాబాద్ లాల్‌ బహదూర్‌ స్టేడియంలో ఎన్టీఆర్ నేతృత్యంలో 15మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తుంటే లక్షలాది ప్రజల ఆనందేతిరేకంతో దద్దరిల్లింది.

లోక్‌సభలో.. తెలుగు వైభవం

అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 203 అసెంబ్లీలో స్థానాల్లో గెలిచి అధికారంలోకి రావటమే కాదు.. 42 లోక్‌సభ స్థానాల్లో 35ఎంపీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయదరహాసం చేశారు. 1983లో భారత దేశం మొత్తం మీద 544 లోక్‌సభ స్థానాలకుగాను 400 స్థానాలను గెలుచుకుని కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుంటే.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం తెలుగుదేశం పార్టీ ఘనవిజయం సాధించింది. ప్రధాన ప్రతిపక్షంగా అప్పటి లోక్ సభలో ప్రత్యక్షమైంది.

తొలి కేబినెట్‌లో మంత్రులు వీరే..

  1. నందమూరితారకరామారావు – ముఖ్యమంత్రి, హోం, శాంతిభద్రతలు, పరిపాలన, సమాచారం, భారీ పరిశ్రమలు, ప్రణాళిక మిగిలిన శాఖలు
  2. నాదెండ్ల భాస్కరరావు – ఆర్థిక, వాణిజ్య పన్నులు, ఇంధన
  3. కుందూరుజానారెడ్డి – వ్యవసాయం, సహకార
    a. యనమలరామకృష్ణుడు- న్యాయ, మున్సిపల్‌ పరిపాలనటీ. జీవన్‌రెడ్డి – ఎక్సైజ్‌ శాఖ
    b. ఎస్‌.సత్యనారాయణ–రవాణా శాఖ
    c. కావలిప్రతిభాభారతి – సాంఘికసంక్షేమ
    d. మహేంద్రనాథ్‌ – రెవెన్యూ, పౌరసరఫరాలు
    e. ఎస్‌.రామమునిరెడ్డి – వైద్య, ఆరోగ్యశాఖలు
  4. కరణంరామచంద్రరావు – పంచాయతీరాజ్‌
  5. నల్లపురెడ్డిశ్రీనివాసులురెడ్డి – ప్రజాపనులు, నీటి పారుదల
  6. మహమ్మద్‌షకీర్‌ – పర్యాటకం, వక్ఫ్‌
  7. ఎం.రామచంద్రరావు – కార్మిక, ఉపాధి
  8. పూసపాటిఆనందగజపతిరాజు – విద్య
  9. యీలిఆంజనేయులు – దేవాదాయశాఖ
    వీరిలో ఇప్పటికీ పలువురు యాక్టివ్ రాజకీయాల్లో కొనసాగుతున్నారు. టీడీపీలోని యనమల రామకృష్ణుడి తనయ దివ్య ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. .. ఇక కుందూరు జానారెడ్డి ఉమ్మడి ఏపీలో సుదీర్ఘ కాలం పాటు మంత్రిగా పని చేసిన రికార్డు ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం విశ్రాంతి తీసుకొంటున్నారు. టీ జీవన్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఇటీవల ఎన్నకల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. చేగొండి హరిరామ జోగయ్య, ముద్ర గడ పద్మనాభం ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నారు. కానీ ఎన్నికలకు దూరంగా ఉన్నారు.

కాంగ్రెస్ రెడ్డి రాజ్యానికి ఎన్టీఆర్ తెర

టీడీపీ కాంగ్రెస్ ఇతర పార్టీలు మొత్తం
రెడ్డి 31 7 5 43
కాపు 13 1 1 15
బీసీలు 29 3 0 32
ఎస్సీలు 21 1 0 22
ఎస్టీలు 06 02 0 08
క్షత్రియులు 12 02 0 14
ముగ్గురు వైశ్యులు, ఒకరు మార్వాడీ, ఇద్దరు ముస్లీంలు, ఒక క్రిస్టియన్ వీరందరూ టీడీపీలోనే గెలిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement