Monday, November 25, 2024

Andhra Pradesh – మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్

ఎపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. పలువురు మంత్రులు బాధ్యతలు కూడా స్వీకరించి ఆయా శాఖల కార్యకలాపాలపై దృష్టి సారించారు.

ఈ నేపథ్యంలోనే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్‌ రాష్ట్ర ఐటీ, విద్యా, ఆర్టీజీ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.ఏపీ సచివాలయం నాలుగో బ్లాక్‌ రూమ్‌ నంబర్‌ 208లోని తన ఛాంబర్‌లో మొదట నారా లోకేశ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. పలు దస్త్రాలను ఆయన పరిశీలించారు.

- Advertisement -

అంతకు ముందు సచివాలయానికి చేరుకున్న లోకేశ్‌కు పండితులు వేదమంత్రోచ్ఛరణలతో స్వాగతం పలికారు

.మరోవైపు ఇవాళ ఏపీ మంత్రివర్గం తొలిసారిగా భేటీ అవుతున్న విషయం తెలిసిందే. జులై నెలాఖరుకల్లా ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ స్థానంలో సాధారణ బడ్జెట్‌ ప్రవేశపెట్టాల్సి ఉన్నందున, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, బడ్జెట్‌లో చేర్చాల్సిన అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. మరోవైపు 100 రోజుల్లో అమలు చేయాల్సిన కార్యచరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యాలు నిర్దేశించనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement