ప్రభ న్యూస్, పల్నాడు బ్యూరో పోలింగ్ రోజు జరిగిన ఘటనలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పోలింగ్ రోజు,ఆ తర్వాత జరిగిన విధ్వంసక చర్యలపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. ఈ మేరకు అన్ని పరిణామాలపై దర్యాప్తు చేయాలని సిట్ బృందాన్ని ఏర్పాటు చేసిన విషయం విధి తమే.
జిల్లాలోని గురజాల మాచర్ల నరసరావుపేట, సత్తనపల్లి పెదకూరపాడు నియోజకవర్గాలలో జరిగిన ఘర్షణలకు సంబంధించిన వివరాలు సేకరించింది. జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్లో పర్యటించిన సిట్ బృందం అనేకమంది పై కేసు నమోదు చేసిన విషయాన్ని పరిశీలించింది. సుమారు 350 మంది పై కేసు నమోదు చేసిన విషయం తెలుసుకున్న సిట్ బృంద ఇప్పటికే డీజీపీకి సీఎస్ కు నివేదిక అందజేసింది.
ఈవీఎంను ధ్వంసం చేసిన పిన్నెల్లి
. ఇదిలా ఉండగా,మాచర్ల మాచర్ల నియోజకవర్గం లో పోలింగ్ రోజు అనేక ఘర్షణ పూరిత ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇందులో ప్రధానంగా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయి గేటు సమీపంలో ఉన్న 2002 పోలింగ్ బూతులకు ప్రవేశించి ఆగ్రహంతో ఈవీఎం ను పగలగొట్టారు.
. ఈ ఘటన సిసిటీవీలో రికార్డు అయింది. పోలింగ్ జరిగి తొమ్మిది రోజులు అవుతున్న ఇప్పటివరకు వెలుగులు వెలుగులోకి రాని రికార్డ్ అయిన వీడియో అకస్మాత్తుగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమై హల్చల్ చేస్తుంది. జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
ప్రధాన పార్టీలైన వైసీపీ టిడిపి ఒకరిపై ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో ఈవీఎం పగలగొట్టిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడం తీవ్ర చర్చకు దారి తీసింది.
ప్రజలు తమకు ఓట్లు వేయటం లేదని, జగన్ చేయని పాపం లేదు.
— Telugu Desam Party (@JaiTDP) May 21, 2024
పోలింగ్ జరిగిన రోజు, మాచర్ల నియోజకవర్గంలోని పాల్వా గేట్ పోలింగ్ కేంద్రంలో(202), ఏకంగా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఈవీఎంలు ధ్వంసం చేస్తున్న దృశ్యాలు సిసి ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి.
ఒక పక్క ఈవీఎంల ధ్వంసం, మరో పక్క… pic.twitter.com/RaZiLJfdKl